ముందే చెప్పి..కేసీఆర్ ఆకస్మిక పర్యటనలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రచారానికి విస్తృతంగా పర్యటించారు తప్ప.. అధికారిక కార్యక్రమాల కోసం ఇంత వరకూ జిల్లాల పర్యటనలు పెట్టుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఐదేళ్లలో ఒక్క సారి కూడా పర్యటించలేదని.. పార్టీ నుంచి వెళ్లి పోయేటప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఖారారయ్యాయన్న ప్రచారం జరిగింది.కానీ పెద్దగాఆచరమలోకి రాలేదు. ఇప్పుడు మాత్రం.. కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణుగుతూండటం.. రాజకీయంగా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూడడటంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

జూన్ ఇరవయ్యో తేదీ నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనల్లో..ఆకస్మికంగా కొన్ని చోట్ల పర్యటిస్తానని కేసీఆర్ అధికావర్గాలకు తేల్చి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు… ప్రాజెక్టుల గురించి ఎక్కడికక్కడ ఆయన పరిశీలన చేయనున్నారు. అడిషనల్ కలెక్టర్లకు కేసీఆర్ కియా కార్నివాల్ కార్లను కేటాయించారు. వాటిని అందచేయడానికి అడిషనల్ కలెక్టర్లందర్నీ ప్రగతి భవన్‌కు పిలిపించారు. పనిలో పనిగా ప్రత్యేకంగా ఓ సమీక్షా సమావేశం కూడా పెట్టారు. ఇందులోనే.. అధికారులకు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదని..తన జిల్లాల పర్యటనలో ఆకస్మిక తనిఖీల్లోనే పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో తనిఖీలు చేస్తానని.. జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ అధికారులకు ముందే చెప్పారు. అయితే.. ఆయా జిల్లాల్లో ఎక్కడకు వెళ్తారన్నదానిపై స్పష్టత లేదు., కేసీఆర్ నిర్ణయించుకుంటారా.. అధికారులు ప్లేస్ డిసైడ్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అధికారులు డిసైడ్ చేస్తే మాత్రం నిజాలు కేసీఆర్‌కు తెలిసే అవకాశం లేదని.. కేసీఆర్‌కు… అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పరంగా ఎక్కడెక్కడ పనులు .. ప్రాజెక్టులు జరుగుతున్నాయో తెలుసుకాబట్టి… ఆయన ఎంపిక చేసుకుంటేనే.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. కేసీఆర్ ఆకస్మిక తనిఖీలు… ప్రసహసనంగా మారుతాయో.. లేకపోతే.. అధికారవర్గాల్లో బాధ్యత పెంచుతాయో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

ఎడిటర్స్ కామెంట్ : “ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” ..

"ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్" .. హెన్సీ కేట్ అనే పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్య ఇంది. దశాబ్దాలు...

HOT NEWS

[X] Close
[X] Close