ఆ సెంటిమెంట్ ఖ‌రీదు.. కోటిన్న‌ర‌

‘పూజా.. కాజా… ‘ అంటూ ఈమ‌ధ్య దిల్ రాజు సైతం పూజా హెగ్డేని ఆకాశానికి ఎత్తేశాడు. పూజా కెరీర్ అలా ఉంది. పూజా అడుగుపెడితే చాలు సినిమా హిట్ట‌ని దిల్ రాజు మైకు ప‌ట్టుకుని మ‌రీ చెప్పేశారు. దాన్ని బ‌ట్టి… పూజాపై దిల్ రాజుకి ఎంత న‌మ్మ‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే.. ‘ఎఫ్ 3’లో పూజా కు చోటిచ్చారేమో అనిపిస్తోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం.. ఎఫ్ 3. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌లు హీరోలు. ఈ సినిమాలో పూజా ఐటెమ్ సాంగ్ చేస్తోంది. శుక్ర‌వారం నుంచి హైద‌రాబాద్ లో ఈ పాట‌ని తెర‌కెక్కించ‌డం మొద‌లెట్టారు. ఈ పాట‌లో.. వెంకీ, వ‌రుణ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ లు కూడా క‌నిపిస్తారు. నిజానికి ఈ సినిమాలో ఓ ఐటెమ్ పాట పెట్టాల‌న్న ఆలోచ‌న ముందు ఎవ్వ‌రికీ లేదు. సినిమా అంతా అయిపోయాక‌.. ఈ ఐడియా వ‌చ్చింది. అందుకే… పూజాని రంగంలోకి దింపారు. ఆ మాట‌కొస్తే… ఈ సినిమా ఇప్ప‌టికే గ్లామ‌ర్ భామ‌లో నిండిపోయింది. త‌మ‌న్నా, మెహ‌రీన్‌ల‌తో పాటు ఇందులో సోనాల్ చౌహాన్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంటే ముగ్గురు హీరోయిన్ల‌న్న‌మాట‌. అయినా కొత్త‌గా గ్లామ‌ర్ యాడ్ చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చిందంటే… అదంతా పూజా పై ఉన్న సెంటిమెంట్ వ‌ల్లే. కాక‌పోతే.. ఒక్క‌టే తేడా కొడుతోంది. ఈమ‌ధ్య పూజా చేసిన రాధేశ్యామ్ బోల్తా కొట్టింది. మొన్న‌టికి మొన్న ‘బీస్ట్’ కూడా తేడా చేసింది. అయినా స‌రే, పూజా ఉంటే సినిమా హిట్టేన‌ని దిల్ రాజు ఇంకా గ‌ట్టిగా న‌మ్ముతున్నారంటే, ఆ సెంటిమెంట్ కోసం పూజాకి కోటిన్న‌ర వ‌ర‌కూ పారితోషికం ఇవ్వ‌డానికి రెడీ అయ్యారంటే.. గ్రేటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close