రామ్ సినిమాకీ అదే స‌మ‌స్య‌

రామ్ ప్ర‌స్తుతం `ది వారియర్‌`తో బిజీగా ఉన్నాడు. ఆ వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా ఖ‌రారు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్టు ప‌నుల్లో బోయ‌పాటి శ్రీ‌ను బిజీ.. బిజీ. ఇందులో ఓ క‌థానాయిక‌గా ర‌ష్మిక పేరు ఖ‌రారు చేశార‌ని వార్త‌లొచ్చాయి. ర‌ష్మిక ద‌గ్గ‌ర‌కు ప్ర‌పోజ‌ల్ వెళ్లిన మాట వాస్త‌వ‌మే. అయితే.. త‌ను ఇంకా డైలామాలోనే ఉంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ర‌ష్మిక య‌స్ అనీ, నో అని చెప్ప‌లేద‌ని, టీమ్ ని స‌స్పెన్స్‌లోనే ఉంచింద‌ని తెలుస్తోంది. అందుకు అనేక కార‌ణాలున్నాయి. ర‌ష్మిక ఇప్పుడు విజ‌య్ సినిమాని ఓకే చేసింది. ఆ సినిమాకి కాల్షీట్లు స‌ర్దుబాటు చేయ‌డం క‌ష్ట‌మ‌వుతోంది.
మ‌రోవైపు ఈ సినిమాకి ర‌ష్మిక ఓకే చెబితే స‌రిపోదు. మ‌రో క‌థానాయిక కూడా ఉంది. అందుకోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ని దించాల‌ని ప్ర‌య‌త్నం. అయితే ఆ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా స్ప‌ష్టం కాలేదు. నాలుగైదు ఆప్ష‌న్లు చేతిలో ఉన్నా.. వాళ్లెవ‌రూ ప్ర‌స్తుతానికి అందుబాటులో లేర‌ని స‌మాచారం. ఈ సినిమాకి కావ‌ల్సిన ఇద్ద‌రు హీరోయిన్లూ… ఇంకా ఖ‌రారు కాక‌పోవ‌డంతో చిత్ర‌బృందం కొంచెం టెన్ష‌న్‌లో ఉంద‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్య సినిమాలన్నింటికీ హీరోయిన్ల‌తోనే చిక్కొస్తోంది. ఎడాపెడా సినిమాలు మొద‌లైపోవ‌డంతో హీరోయిన్లంతా బిజీ అయిపోయారు. దాంతో సినిమాల‌కు కావ‌ల్సిన హీరోయిన్లు దొర‌క‌డం లేదు. ఇప్పుడు రామ్ సినిమాకీ అదే స‌మ‌స్య ఏర్ప‌డిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close