బాలీవుడ్ కంటే టాలీవుడ్డే బెట‌ర్‌: దిల్ రాజు

లాన్ డౌన్ త‌ర‌వాత‌.. దేశ వ్యాప్తంగా సినిమాలు విడుద‌లయ్యాయి. అన్ని భాష‌ల్లోనూ.. మ‌ళ్లీ కొత్త సినిమాలొచ్చాయి. కానీ.. టాలీవుడ్ లో ఉన్న స‌క్సెస్ రేటు ఎక్క‌డా లేదు. ఈ నాలుగు నెల‌ల్లో తెలుగులో నాలుగైదు హిట్ సినిమాలు ప‌డ్డాయి. బాలీవుడ్ లో అయితే ఒక్క‌టీ లేదు. ఈ విష‌యంలో బాలీవుడ్ కంటే మ‌న‌మే బెట‌ర్. దిల్ రాజు కూడా ఈ మాటే చెబుతున్నారు. ”క‌రోనా తో చిత్ర‌సీమ కుదేలైపోయింది. మ‌ళ్లీ తేరుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌నం మాత్రం ఓ అడుగు ముందే ఉన్నాం. ధైర్యంగా సినిమాలు విడుద‌ల చేస్తున్నాం. బాలీవుడ్ లో అదీ లేదు. వాళ్లు సినిమా విడుద‌ల చేయ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. ఆడియ‌న్స్ కూడా రావ‌డం లేదు. ఇక్క‌డ అలా లేదు. ప‌రిస్థితి మెరుగ్గా ఉంది. నిర్మాత‌లే కాదు, ప్రేక్ష‌కులూ ధైర్యం చేస్తున్నారు. అందుకే ఇక్క‌డ సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి” అన్నారు.

త్వ‌ర‌లోనే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న తెలుగు రాష్ట్రాల్లో వ‌స్తుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై కూడా స్పందించారు. ”ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని చ‌ర్య‌లూ తీసుకోవ‌డం ప్ర‌భుత్వాల బాధ్య‌త‌. 50 శాతం నిబంధ‌న పెట్టినా పెట్టొచ్చు. కానీ 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, సినిమాల్ని విడుద‌ల చేయ‌డ‌మే ఉత్త‌మం. సినిమాలు త‌యారు చేసుకుని, విడుద‌ల కాకుండా ఆపేయ‌డం మంచిది కాదు. కార్మికుల‌పై అది తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. కాబ‌ట్టి.. 50 శాతం నిబంధ‌న ఉన్నా.. తెలుగులో సినిమాలు విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ధంగానే ఉన్నార‌”ని దిల్ రాజు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close