ఎందుకీ ఉపఎన్నిక..!?

తిరుపతి ఉపఎన్నికలో వెలుగు చూస్తున్న చిత్రాలు.. ఔరా అనిపించేలా ఉన్నాయి. ఏ పోలింగ్‌ బూత్‌కి వెళ్లి క్యూలో నిల్చున్న వారి ఓటర్ కార్డులను పరిశీలించిన దొంగ ఓటర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా క్యూలో ఉన్న వారిని ప్రశ్నిస్తే నలుగురు దొంగ ఓటర్లు పట్టుబడ్డారు. చివరికి బీజేపీ ఏజెంటె ఓటును ఓ వ్యక్తి ఓటర్ కార్డు తీసుకొచ్చి మరీ వేయబోయారు. దీంతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న ఏజెంట్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాల నుంచి మనుషులను తెప్పించారు. వైసీపీకి చెందిన కల్యాణమండపాలు. హోటళ్లలో వారిని దింపారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత అందరూ.. రోడ్ల మీదకు వచ్చారు. వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్‌లలలో ఓట్లు వేయడం ప్రారంభించారు.

ఏ పోలింగ్‌బూత్‌లో చూసినా దొంగ ఓటర్లే..!

దొంగ ఓటర్ల గుట్టును ఆలస్యంగా కనిపెట్టడంతో ఇతర పార్టీ నేతలు… ఆయా పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా పెట్టారు. చాలా వరకూ దొంగ ఓట్లను పోల్ చేసుకున్నారు. విపక్ష పార్టీల నేతలు అడ్డుకున్నా.. దొంగ ఓటర్లంటూ పోలీసులకు పట్టించినా ఎలాంటిప్రయోజనం లేకపోయింది. ఏ ఒక్క పోలీసు కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎన్నికల పరిశీలకులు అడ్రస్ లేరు. ఒక్క తిరుపతి మాత్రమే కాదు.. నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. నిజానికి గట్టి నిఘా.. సోదాలు ఉండాలి. ఎన్నికల సమయంలో అవి ముఖ్యం. కానీ తిరుపతి నియోజకవర్గంలోకి పోలింగ్ రోజు ఇతరులు వేల సంఖ్యలో వస్తూంటే…కనీసం సరిహద్దుల్లో ఎలాంటి చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేయలేదు.

వ్యవస్థలన్నీ కలసికట్టుగా సహకారం..!

దొంగ ఓటర్లు కొన్ని వేల మంది వచ్చినట్లుగా స్పష్టంగా తెలియడంతో రాజకీయంగా కలకలం ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ కూడా… తక్షణం దొంగ ఓట్లను నిరోధించాలని బందోబస్తును పటిష్టం చేయాలని ఆదేశించింది. కానీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. రాజకీయ పార్టీలన్నీ తిరుపతిలో పరిస్థితిపై మండిపడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని పట్ట పగలు ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంత మాత్రం దానికి ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేసింది. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. దొంగ ఓట్లను నిరోధించలేకపోతున్నారని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. బీజేపీ నేతలు కూడా… దొంగ ఓట్ల అరాచకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారంతా శ్రీవారి భక్తులని వైసీపీ సమర్థన..!

వైసీపీ మాత్రం.. వారంతా దొంగ ఓటర్లు కాదని.. శ్రీవారి భక్తులని వాదిస్తోంది., ప్రైవేటు బస్సుల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చి పోలింగ్ బూత్‌ల వద్ద లైన్లలో నిల్చున్న వారి శ్రీవారి దర్శనం కోసం వచ్చారని.. వారిని టీడీపీ అడ్డుకుందని … చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరో వైపు పుంగనూరుకు చెందిన పెద్దిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. వారంతా… శ్రీవారి దర్శనానికి వచ్చినవాళ్లేనని వాదించారు. ప్రజాతీర్పు తమవైపే ఉందని చెప్పుకొచ్చారు. తిరుపతి ఉపఎన్నికలో ఇటీవలి కాలంలో లేని విధంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లను తరలించుకు రావడం.. అదీ కూడా వేలల్లో ఉండటం… ఎన్నికల రాజకీయాలను చూసిన వారికి ఔరా అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“బాక్సైట్” మైనింగ్‌పై ఎన్జీటీ కఠిన చర్యలు..! కానీ …

తూర్పుగోదావరి. విశాఖ మన్యం ప్రాంతాల్లో కొంత కాలంగా బాక్సైట్ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వి తీసుకెళ్తున్నారని దీని కోసం రక్షిత అటవీ ప్రాంతంలో రోడ్డు కూడా...

ప్రగతి భవన్ కూల్చేసి.. ఫామ్‌ హౌస్ పంచేస్తారట..!

ప్రగతి భవన్‌ను కూల్చి వేసి ఆ స్థానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే ఎలా ఉంటుంది..?. టీఆర్ఎస్ నేతలకేమో కానీ.. ఇలాంటి ఆలోచనే బీజేపీ నేతలకు ఉత్సాహం తెచ్చి పెడుతుంది. "దళిత...

బాలభారతి పాఠశాలకు 10లక్షల విరాళమిచ్చిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా రెండవ సంవత్సరం ₹10లక్షల విరాళాన్ని కర్నూలు NRI ఫౌండేషన్ అందించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి ఈ...

రివ్యూ: ఇష్క్‌

రేటింగ్: 2.5 అదేంటో గానీ.... కొన్ని సినిమాల టైటిళ్ల‌కీ, ఆ క‌థ‌కూ, క్యారెక్ట‌రైజేష‌న్ల‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. క‌థొక‌టి, టైటిల్ ఒక‌టి. `ఇష్క్‌` అలాంటిదే. ఈ టైటిల్ విన‌గానే ల‌వ్ స్టోరీ అనుకుంటారంతా....

HOT NEWS

[X] Close
[X] Close