రవితేజకి నో చెప్పి.. నాగార్జునతో ఓకే అన్న నిర్మాత!

బోయపాటి శ్రీనుని దర్శకుడుగా పరిచయం చేస్తూ రవితేజ హీరోగా ‘భద్ర’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజు ఆ తర్వాత రవితేజతో మళ్ళీ సినిమా చెయ్యలేదు. చాలా గ్యాప్‌ తర్వాత మళ్ళీ రవితేజతో సినిమా తియ్యాలని ప్లాన్‌ చేసిన దిల్‌రాజు రెమ్యునరేషన్‌ విషయంలో తేడాలు రావడంతో అతనితో చెయ్యాలనుకున్న ప్రాజెక్ట్‌ని అర్థాంతరంగా ఆపేశాడు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ని కింగ్‌ నాగార్జునతో చెయ్యబోతున్నాడన్నది లేటెస్ట్‌ న్యూస్‌. రవితేజకు ఈ కథ నచ్చకపోవడం వల్లే అతనితో ఈ సినిమా చెయ్యడంలేదని దిల్‌రాజు చెప్తున్నా రెమ్యునరేషనే ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోవడానికి మెయిన్‌ రీజన్‌ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ని నాగార్జునతో చెయ్యాలన్న ఉద్దేశంతోనే రెమ్యునరేషన్‌ సాకుతో దిల్‌రాజే.. రవితేజను తప్పించాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

నాగార్జునకు ఇమేజ్‌కి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి ఈ కథ వినిపించారనీ, కథ విన్న నాగార్జున కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఈ సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన నాగార్జున తన నెక్స్‌ట్‌ మూవీ కె.రాఘవేంద్రరావుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘హాథీరాం బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా తర్వాత నాగార్జున, దిల్‌రాజుల సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం వుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close