దిల్ రాజు కాంపౌండ్‌లో రాజ్ త‌రుణ్‌

ఓ వైపు స్టార్ హీరోల‌తో సినిమాలు తీస్తూ.. మ‌రో వైపు యంగ్ హీరోల‌తోనూ హిట్లు కొడుతున్నాడు దిల్‌రాజు. పెద్ద సినిమాల మాటేమో గానీ, చిన్న సినిమాని పెద్ద సినిమాగా మ‌లిచే ట్రిక్కులు మాత్రం దిల్‌రాజుకి బాగా తెలుసు. ఈ యేడాది సంక్రాంతికి శ‌ర్వానంద్ తో పెద్ద హిట్టు కొట్టాడు. శ‌త‌మానం భ‌వ‌తి మెగా హిట్ట‌వ్వ‌డంతో దిల్‌రాజులో జోష్ మ‌రింత పెరిగింది. దాంతో వ‌రుస‌గా యూత్ హీరోల‌తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా.. రాజ్ త‌రుణ్ కోసం ఓ ప్రాజెక్ట్ సిద్ధం చేశాడు. నిజానికి శ‌త‌మానం భ‌వ‌తి రాజ్ త‌రుణ్‌తోనే ప‌ట్టాలెక్కాల్సింది. కానీ…ఆ స‌మ‌యంలో రాజ్ వేరే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. పైగా శ‌త‌మానం భ‌వ‌తిని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌న్న‌ది దిల్‌రాజు ప్లాన్‌. రాజ్ త‌రుణ్‌తో పెట్టుకొంటే సంక్రాంతి బ‌రిలో నిల‌బ‌డ‌డం క‌ష్టం. అందుకే శ‌ర్వానంద్‌ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ సెట్ చేశాడు.

ఇప్పుడు మాత్రం రాజ్ త‌రుణ్ పంట పండింది. ‘అలా ఎలా’ సినిమాతో ఆక‌ట్టుకొన్నాడు అనీష్ కృష్ణ‌. అప్ప‌టి నుంచీ మ‌రో సినిమా ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు. రామ్‌కి ఓ క‌థ చెప్పినా… అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు దిల్ రాజు కాంపౌండ్‌లో అడుగుపెట్టాడు అనీష్‌. రాజ్ త‌రుణ్ కోసం అనీష్ ఓ క‌థ సిద్దం చేశాడ‌ట‌. అది అటు దిల్‌రాజుకీ, ఇటు రాజ్ త‌రుణ్ కీ న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కడానికి రంగం సిద్ద‌మైపోయింది. అతి త్వ‌ర‌లో ఈ కాంబినేష‌న్ కి సంబంధించిన ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.