”వ్యూస్ కోసం క్లిక్స్ కోసం తప్పుడు రాతలు రాయొద్దు. వాస్తవాలు తెలిస్తే రాయండి. లేకపోతే మూసుకోండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు నిర్మాత దిల్ రాజు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ఆ చిత్రాన్ని తాను తొక్కేశాననే వార్తలపై తీవ్రంగా స్పందించారు.
” సినిమాలను ఎవరు తొక్కరు. మేము సినిమాల కోసం సలహాలు సూచనలను మాత్రమే ఇచ్చిపుచ్చుకుంటాం. నిఖిల్ తో నాకు హ్యాపీ డేస్ నుండి అనుబంధం వుంది. నిర్మాతల మధ్య హెల్దీ రిలేషన్స్ ఉంటాయి. కానీ రకరకాల ఊహాగానాలు, వార్తలొచ్చాయి. మీ క్లిక్ లు కోసం, వ్యూస్ కోసం మమ్మల్ని బలి పశువులని చేయొద్దు. నేను తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నాకు వుంది. ఎది నిజం ఎది అబద్దం అనేది తెలుసుకుని రాయాలి. నిజం తెలియకపొతే మూసుకొని కూర్చోవాలి” అని వ్యాఖ్యానించారు దిల్ రాజు.