దిల్‌రాజుకి ఓ ‘బ్రేక్‌’ కావాలిప్పుడు

2017 దిల్‌రాజు కెరీర్‌కి ఓ మైలు రాయి. ఏకంగా ఆయన సంస్థ నుంచి ఆరు సినిమాలొచ్చాయి. ఎంసీఏ, ఫిదా, నేనులోక‌ల్‌, శ‌త‌మానం భ‌వ‌తి.. ఇలా హిట్లు మీద హిట్లు కొట్టారు. డీజే కూడా ఆర్థికంగా సంతృప్తినే అందించింది. అయితే 2018 మాత్రం దెబ్బ‌కొట్టేసింది. అటు నిర్మాత‌గా, ఇటు పంపిణీ దారుడిగా ఆయ‌న‌కేమాత్రం క‌ల‌సి రాలేదు. శ్రీ‌నివాస క‌ల్యాణం, ల‌వర్‌చిత్రాలు పూర్తిగా నిశార ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌కో బ్రేక్ కావాలి. అది ‘ఎఫ్ 2’ రూపంలో వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశ‌.

ఎందుకంటే అనిల్ రావిపూడి.. దిల్‌రాజుకి బాగా క‌లిసొచ్చాడు. సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ సినిమాల‌తో ఈ సంస్థ‌కు రెండు విజ‌యాల్ని అందించాడు అనిల్ రావిపూడి. ఇది ముచ్చ‌ట‌గా మూడో సినిమా. కాబ‌ట్టి హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం అనే ధీమా దిల్‌రాజు మొహంలో క‌నిపిస్తూనే ఉంది. సంక్రాంతికి వ‌చ్చే సంపూర్ణ‌మైన వినోదాత్మ‌క చిత్ర‌మిదే. కుటుంబ ప్రేక్ష‌కుల‌తో చూసే ల‌క్ష‌ణాలూ పుష్క‌లంగా ఉంటాయి. కాబ‌ట్టి… ‘బాగుంది’ అనిపించుకుంటే దిల్‌రాజుకి తిరుగుండ‌దు. 2017లో పెద్ద సినిమాతో పోటీగా ‘శ‌త‌మానం భ‌వ‌తి’ విడుద‌ల చేసి సూప‌ర్ హిట్ కొట్టారు దిల్‌రాజు. ఇప్పుడూ అదే సెంటిమెంట్ ఆయ‌న్ని ఊరిస్తోంది. `ఎఫ్ 2` అనుకున్న విజ‌యాన్ని అందుకుంటే.. 2018 లోటుని ఈ యేడాది ఆరంభంలోనే తీర్చుకునే అవ‌కాశం ఉంటుంది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు...

పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత...

HOT NEWS

[X] Close
[X] Close