వెంకీ సినిమాకి ఇది ప్రీమేక్ లా ఉందే..!

‘మిస్ట‌ర్‌ మ‌జ్ను’ టీజ‌ర్ మంచి రొమాంటిక్ గా క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. కుర్రాళ్ల‌కు కావ‌ల్సిన స‌రుకు టీజ‌ర్లోనే చూపించేశాడు. అయితే… టీజ‌ర్ చూస్తున్న‌ప్పుడు వెంక‌టేష్ పాత సినిమా ఒక‌టి క‌ళ్ల ముందు మెద‌ల‌డం ఖాయం. అదే. ‘ప్రేమ‌తో రా’. వెంక‌టేష్- సిమ్రాన్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. వెంకీ ‘రా’ సెంటిమెంట్ ని బ్రేక్‌చేసిన సినిమా ఇది. అప్ప‌ట్లో వెంక‌టేష్ ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా… అంటూ ‘రా’ ప‌రంప‌ర‌తో కొన్ని సినిమాలు చేశారు. వాటిలో ఇదే ఫ్లాప్‌. ప్రేమ‌తో రా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది.పాట‌లూ హిట్ట‌య్యాయి. కానీ సినిమా తేలిపోయింది. వెంక‌టేష్ ఇందులో ఓ ప్లే బాయ్‌. అమ్మాయిల్ని ఫ్ల‌ట్ చేసి, శారీర‌కంగా వాడుకుని, ఆ త‌ర‌వాత వాళ్ల‌కు బైబై చెప్పేస్తుంటాడు.సిమ్రాన్‌ని కూడా అలానే ప్రేమ మ‌త్తులో దింపి, శారీక‌రంగా ఒక‌టైన త‌ర‌వాత‌.. గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతాడు. కానీ.. సిమ్రాన్‌ని సీరియ‌స్‌గా ప్రేమిస్తున్నాన‌న్న విష‌యం అర్థ‌మై.. మ‌ళ్లీ ఆమె కోసం తిరిగొస్తాడు. కానీ అప్ప‌టికే వెంక‌టేష్‌పై ద్వేషం పెంచుకుంటుంది సిమ్రాన్‌. ఆమె మ‌న‌సుని మ‌ళ్లీ ఎలా మార్చుకున్నాడు. త‌న ప్రేమ‌లోని నిజాయ‌తీ ఎలా చూపించాడు? అనేదే ‘ప్రేమ‌తో రా’.

అచ్చంగా ఇదే లైన్‌లో ‘మిస్ట‌ర్‌ మ‌జ్ను’ సాగుతోంద‌నిపిస్తోంది. మ‌జ్ను అనే పేరు ప్రేమ‌కుప్ర‌తిరూపం. కానీ ఈ మ‌జ్ను మాత్రం ప్రేమ పేరుతో అంద‌మైన అమ్మాయిల వెంట‌ప‌డుతుంటాడు. త‌న మ‌న‌సుని, ప్రేమ‌పై త‌న‌కున్న అభిప్రాయాన్ని ఓ అమ్మాయి ఎలా మార్చింద‌న్న‌దే క‌థ‌. అప్ప‌టి `ప్రేమ‌తో రా` క‌థ‌కూ దీనికీ కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నా.. టేకింగ్ ప‌రంగా వెంకీ అట్లూరి ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడు. మ‌రి అఖిల్ విష‌యంలో అయినా.. ఈ క‌థ వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close