నా సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్‌… పోస్ట‌ర్ రెడీ చేసేసుకోండి

ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ త‌న సినిమాపై న‌మ్మ‌కం ఉంటుంది. `మా సినిమా బాగుంటుంది.. త‌ప్ప‌కుండా చూడండి` అని చెప్పుకోవ‌డం చాలా చాలా స‌హ‌జం. వాళ్లు న‌మ్మ‌క‌పోతే సినిమాని ఎవ‌రు న‌మ్ముతారు? అయితే అజ‌య్ భూప‌తి స్టైల్ వేరు. త‌న సినిమాపై త‌న‌కు మ‌రింత ఎక్కువ న‌మ్మ‌కం. `ఆర్‌.ఎక్స్ 100` స‌మ‌యంలో… `రాసి పెట్టుకోండి ఈ సినిమా హిట్టు` అని విడుద‌ల‌కు ముందే చెప్పాడు. అప్పుడు అజ‌య్ భూప‌తి ఎవ‌రో తెలీదు. అందులో న‌టించిన కార్తీకేయ ఎవ‌డో తెలీదు.అదంతా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌గా క‌నిపించింది. కానీ అనూహ్యంగా ఆ మాటే నిజ‌మై.. ఆర్‌.ఎక్స్ 100 హిట్ట‌య్యింది. ఇప్పుడు త‌న రెండో సినిమాగా `మ‌హా స‌ముద్రం`ని తీసుకొచ్చాడు. ఈనెల 14న ఈ సినిమా రిలీజ్‌. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో.. సేమ్ టూ సేమ్ `ఆర్‌.ఎక్స్ 100` నాటి కాన్ఫిడెన్స్‌నే చూపించాడు అజ‌య్‌.

”రాసి పెట్టుకోండి. ఈసినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్. పోస్ట‌ర్లు కూడా రెడీ చేసేసుకోండి” అంటూ ప్ర‌క‌టించేశాడు. ”ఆర్‌.ఎక్స్ 100 స‌మ‌యంలో నేను ఇలానే మాట్లాడాను. అప్పుడు నాది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ హిట్టు చేసి చూపించాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నాను. 14న రిలీజ్ అవుతున్న నా సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్టు. నా సినిమాపై నాకు అంత న‌మ్మ‌కం. ఈ సినిమా చూశాక ప్రేక్ష‌కులూ అదే మాట చెబుతారు” అంటూ.. త‌న న‌మ్మ‌కాన్ని మ‌రోసారి భారీ స్థాయిలో వ్య‌క్త ప‌రిచాడు. చెప్పి మ‌రీ హిట్టు కొట్ట‌డం మామూలు విష‌యం కాదు. మ‌హా స‌ముద్రం విష‌యంలో అజ‌య్ భూప‌తి మాటే నిజ‌మైతే – మూడో సినిమా నుంచి… భూప‌తి స్టార్ డైరెక్ట‌ర్ అయిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close