ఓటుకి రూ.25 వేలు ఇస్తున్నారు: న‌రేష్ ఆరోప‌ణ‌

‘మా’ ఎన్నిక‌ల ప్ర‌చారం పూర్త‌య్యింది. రేపే ఓటింగ్‌. ఈసారి వేడి మామూలుగా లేదు. చివ‌రి క్ష‌ణాల్లోనూ… ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వాళ్లు ముమ్మ‌రం చేస్తున్నారు. తాజాగా న‌రేష్ ఓ సంచ‌ల‌న ఆరోపణ చేశారు. ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం (ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్‌) ఓటుకి రూ.10 వేల నుంచి రూ.25 వేల వ‌ర‌కూ పంచుతున్నార‌ని, ఆ డ‌బ్బులు తీసుకుని, మ‌న‌స్సాక్షికి నచ్చిన‌ట్టుగా ఓటేయ‌మ‌ని ఆయ‌న మా స‌భ్యుల్ని కోరారు. `మా` లో గెలుపుకోసం ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం కుయుక్తులు ప‌న్నుతోంద‌ని, రాత్రి ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు పంచుతున్నార‌ని ఆరోపిస్తూ.. ఓ వీడియో బైట్ వ‌దిలారు.

”క‌రోనా స‌మ‌యంలో కొంత‌మంది స‌భ్యుల‌కు ప‌ది వేల రూపాయ‌ల చొప్పున పంచితే నాపై ర‌క‌ర‌కాల కామెంట్లు చేశారు. ఇప్పుడు ఓటుకి పాతిక వేలు పంచుతున్నారు. అందుకే వాళ్లు మానిఫెస్టో కూడా విడుద‌ల చేశారు. డ‌బ్బుల‌తో గెలుస్తామ‌న్న‌ది వాళ్ల భ‌రోసా. డ‌బ్బుల‌తో గెలిచేద్దాం అనుకుంటున్నారు. ఇస్తే తీసేసుకోండి. ఎందుకంటే వాళ్ల నుంచి మ‌ళ్లీ డ‌బ్బులు రావు. ఓటుమాత్రం విష్ణు ప్యాన‌ల్ కి వేయండి. నేనెప్పుడూ అబ‌ద్ధాలు ఆడ‌ను. త‌ప్పులు చెప్ప‌ను. నాకొచ్చిన వార్త‌ని మీతో పంచుకున్నా” అని వీడియోలో పేర్కున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close