వాట్ నెక్ట్స్ బాబీ…??

ఇప్పుడో హిట్టు కొట్ట‌డ‌మే గ‌గ‌నం. చేతిలో హిట్ ఉంచుకొని ఖాళీగా ఉడ‌డం మ‌హాపాపం. అయితే బాబి ప‌రిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. ప‌వ‌ర్ తో తన స్టామినా చూపించిన బాబి.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యానికొచ్చేస‌రికి చ‌తికిల ప‌డిపోయాడు. నిజానికి ఆ సినిమా ఫ్లాప్ భారం బాబిపై పెద్ద‌గా ప‌డ‌లేద‌నే చెప్పాలి. ‘ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడంతే’ అనే సింప‌తీ బాబిని కాపాడింది. ఆ సినిమా హిట్ట‌యితే ప‌రిస్థితి ఎలా ఉండేదో తెలీదు గానీ, ఫ్లాప్ లో వాటా మాత్రం అంత‌గా అందుకోలేదు. అందుకే వెంట‌నే ‘జై ల‌వ‌కుశ‌’ చేసే అవ‌కాశం ద‌క్కింది. ఎన్టీఆర్‌ని మూడు విభిన్న పాత్ర‌ల్లో చూపించి స‌క్సెస్ కొట్టాడు బాబి. ‘జై ల‌వ‌కుశ‌’ వ‌చ్చి వెళ్లిపోయింది. రేపో మాపో టీవీల్లో కూడా వేసేస్తారు. అయితే బాబి నెక్ట్స్ సినిమా ఏంట‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. క‌నీసం చూచాయిగా ఓ వార్త కూడా బ‌య‌ట‌కు రాలేదు. బాబి కూడా రిలాక్స‌యిపోయాడ‌నిపిస్తోంది. హిట్‌ని కాపాడుకోవాల‌న్న ఉద్దేశంతో తాను కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం కుటుంబంతో క‌ల‌సి గ‌డుపుతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతాన‌ని అంటున్నాడు. ర‌వితేజ – బాబి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే దానికి కాస్త టైమ్ ప‌ట్టేట్టు క‌నిపిస్తోంది. ఈలోగా సాయిధ‌ర‌మ్‌తేజ్ తో ఓ సినిమా చేసే ఛాన్సుంద‌ని స‌మాచారం. ఒక‌రిద్ద‌రు యువ హీరోలు కూడా బాబితో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు స‌మాచారం. బాబి ఎటువైపు అడుగు వేస్తాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.