ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీల‌కం. హ‌ను సినిమాల్లో హీరోయిన్ల పాత్ర‌లు బాగా హైలెట్ అవుతుంటాయి. ‘అందాల రాక్ష‌సి’ నుంచి ‘సీతారామం’ వ‌ర‌కూ ఆయ‌న క‌థల్లో హీరోయిన్లు మెరిశారు. ఇప్పుడు కూడా హీరోయిన్‌కు అంత‌టి ప్రాధాన్యం ఉన్న పాత్రే అని టాక్‌. అందుకోసం క‌థానాయిక‌ల వేట మొద‌లైంది.

ప్రభాస్ ఇమేజ్‌కీ, ఈ సినిమా స్పాన్‌కీ త‌గ్గ‌ట్టుగా బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని తీసుకొద్దామ‌నుకొన్నారు. దీపికా ప‌దుకొణె, అలియాభ‌ట్ లాంటి పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే.. స‌మ‌స్య‌ల్లా, హీరోయిన్ కాల్షీట్లు గంప‌గుత్త‌గా కావాలి. క‌నీసం 100 నుంచి 120 రోజుల కాల్షీట్లు కేటాయించాలి. దాదాపుగాద సినిమా జ‌రిగిన‌న్ని రోజులూ హీరోయిన్ సెట్లో ఉండాల్సిందే. ఇన్నిన్ని కాల్షీట్లు ఇవ్వ‌డం ఈత‌రం స్టార్ హీరోయిన్ల‌కు క‌ష్ట‌మైన ప‌నే. అందుకే హీరోయిన్ దొర‌క‌డం లేదు. అందుకే ఈసారి కొత్త ఓ కొత్త క‌థానాయిక‌ని వెదికి ప‌ట్టుకొందాం అనే ఆలోచ‌న‌ల్లో ఉన్నాడు హ‌ను. ‘అందాల రాక్ష‌సి’,’కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌’, ‘సీతారామం’ ఈ సినిమాల్లో న‌టించిన హీరోయిన్లంతా అప్ప‌టికి కొత్త‌వాళ్లే. ఆ సినిమాల‌తోనే వాళ్లు పాపుల‌ర్ అయ్యారు. అందుకే మ‌రోసారి కొత్త‌మ్మాయికే ఓటేయ్యాల‌ని భావిస్తున్నాడు. అయితే ప్ర‌భాస్ ప‌క్క‌న కొత్త‌మ్మాయి అంటే ఫ్యాన్స్ ఎలా రివీవ్ చేసుకొంటారో? అనే భ‌యం హ‌నుని వెంటాడుతోంది. అందుకే ఈ విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌రులో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ప్ర‌స్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. రెండు పాట‌లు కూడా రెడీ అయ్యాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close