మారుతి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’

ప్ర‌తిరోజూ పండ‌గే త‌ర‌వాత‌…. మారుతి మ‌రో సినిమా మొద‌లెట్ట‌లేదు. కాక‌పోతే… యూవీ, గీతా ఆర్ట్స్ కలిసి తీయ‌బోయే సినిమాకి త‌నే ద‌ర్శ‌కుడు. వాళ్ల‌తో త‌న‌కు క‌మిట్మెంట్ ఉంది. రామ్, ర‌వితేజ‌ల‌కు క‌థ చెప్పాడు. ర‌వితేజ తో సినిమా దాదాపు ఓకే అనుకుంటున్న త‌రుణంలో పారితోషికం విష‌యంలో పేచీ వ‌చ్చి… ర‌వితేజ త‌ప్పుకున్నాడు. ఇప్పుడు అదే క‌థ‌ని… గోపీచంద్ తో చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు మారుతి.

ఈ సినిమా కోసం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. దాదాపుగా అదే ఖాయ‌మయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇందులో క‌థానాయ‌కుడిది లాయ‌ర్ పాత్ర‌. ఫీజు కోసం ఎలాంటి కేసునైనా వాదిస్తుంటాడ‌ట‌. అందుకే.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` అనే పేరు సూట‌వుతుంద‌ని మారుతి భావిస్తున్నాడు. మారుతితో ప‌నిచేయ‌డానికి గోపీచంద్ రెడీగానే ఉన్నాడు.కాక‌పోతే… డేట్లు స‌ర్దుబాటు కావాలి. త్వ‌ర‌లోనే ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close