మహా స‌ముద్రంలో ఐటెమ్ భామ‌

అజ‌య్ భూప‌తి నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా `మ‌హా స‌ముద్రం`. శ‌ర్వానంద్‌, సిద్దార్థ్.. క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. అతిథిరావు హైద‌రి, అనుఇమ్మానియేల్ క‌థానాయిక‌లు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఈసినిమాలో మ‌రో క‌థానాయిక కూడా ఉంటుంది. అయితే అది ఐటెమ్ సాంగ్ కోసం. ఈ పాట కోసం మ‌న్నారా చోప్రాని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హా – అనే అమ్మాయి చుట్టూ తిరిగే క‌థ ఇది. విశాఖ నేప‌థ్యంలో సాగుతుంది. అందుకే `మ‌హా స‌ముద్రం` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది ప్రేమ క‌థే అయినా.. యాక్ష‌న్ ని గ‌ట్టిగా మేళ‌వించిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మాఫియా బ్యాక్ డ్రాపూ ఉంటుంద‌ట‌. దీపావ‌ళికి విడుద‌ల చేసిన థీమ్ పోస్ట‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. క‌థ‌ని ఆ పోస్ట‌ర్ లో రిఫ్లెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close