రోషన్ కనకాలతో మోగ్లీ సినిమాని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రాజ్. ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ పాత్ర చేస్తున్నాడు. అయితే షూటింగ్ సమయంలో సందీప్, సరోజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయనే కథనాలు వినిపించాయి. దీనిపై డైరెక్టర్ సందీప్ క్లారిటీ ఇచ్చాడు.
‘సరోజ్ కి నాకు మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలు నాకూ వినిపించాయి. దీనికి కారణం కూడా వుంది. ఇంతకుముందు నేను పని చేసిన సుహాస్ నా క్లోజ్ ఫ్రెండ్. సెట్ లో మా మధ్య కెమిస్ట్రీ, స్నేహం మరోలా వుంటుంది. ఇప్పుడు రోషన్ తో రెండేళ్ళు జర్నీ చేశాను. తను కూడా నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. సరోజ్ నా కంటే సినియర్. చాలా సినిమాల చేసిన అనుభవం వుంది. తనతో నాకున్న బాండింగ్ వేరుగా వుంటుంది. అంతేకానీ మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా నేను తను అనుభవంతో ఏదైనా చెప్తే వింటాను. మా మధ్య చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ వుంటుంది. చాలా సార్లు తను అనుకున్నది చేసి చూపిస్తారు. ఏది బెటర్ గా వుంటే అది తీసుకోమని అంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ లో షూటింగ్ జరిగింది. మా మధ్య ఎలాంటి డిఫరెన్స్ లు లేవు’అని కక్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో రవితేజతో చేసే ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చాడు సందీప్. రవితేజ గారితో కథ అనుకున్న మాట నిజమే. చాలా మంచి కథ. అయితే ఆ సమయంలో బడ్జెట్లు అనుకూలించలేదు. రవితేజ గారు చాలా గొప్ప మనసుతో ఇప్పుడు కుదరకపోవచ్చు కానీ ఆ కథ ఎప్పుడైనా మనమే చేద్దామని చెప్పడం.. ఆ కథపై మరింత నమ్మకాన్ని ఇచ్చింది’అని చెప్పుకొచ్చారు.