రెండు టైటిళ్లూ ఫిక్స్ చేసేసిన తేజ‌

`’నేనే రాజు నేనే మంత్రి’తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు తేజ‌. అయితే ఆ త‌ర‌వాత వ‌చ్చిన `సీత‌` బాగా నిరాశ ప‌రిచింది. కానీ తేజ మాత్రం స్పీడు త‌గ్గించ‌లేదు. ఒకేసారి రెండు ప్రాజెక్టుల ప‌నిమీద ఉన్నాడు. రానాతో ఓ సినిమానీ, గోపీచంద్‌తో మరో సినిమానీ ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు.

రానా సినిమాకు ‘రాక్ష‌స‌రాజు రావ‌ణాసురుడు’ అనే పేరు పెట్టార‌ని, గోపీచంద్ సినిమాకి ‘అలివేలు – వేంక‌ట‌ర‌మ‌ణ‌’ అనే పేరు ఫిక్స్ చేశార‌ని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ఈ రెండు పేర్లూ ఖ‌రార‌య్యాయి. ఈరోజు తేజ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ రెండు సినిమాల టైటిళ్ల‌నీ, లోగోల‌నూ తేజ అధికారికంగా ప్ర‌క‌టించారు. రానాతో `రాక్ష‌స‌రాజు రావ‌ణాసురుడు` అనే సినిమా తీస్తాన‌ని, మ‌రో సినిమా గోపీచంద్‌తో ఉంటుంద‌ని తేల్చేశారు. ముందుగా గోపీచంద్ సినిమానే మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన మిగిలిన న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com