తెరాస‌లో మ‌ళ్లీ హ‌రీష్ రావు ప్రాధాన్య‌త చ‌ర్చ‌..!

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో ఎప్ప‌టిక‌ప్పుడు ఈ చ‌ర్చ తెర మీదికి రావ‌డం… అలాంటి ప‌రిస్థితి లేద‌న్న‌ట్టుగా కీల‌కనేత‌లు సంకేతాలు ఇవ్వ‌డం, కొన్నాళ్ల‌పాటు మౌనం, మ‌ళ్లీ అదే చ‌ర్చ‌! ఇప్పుడు మ‌రోసారి తెర మీదికి వ‌స్తోంది తెరాస కీల‌క నేత హ‌రీష్ రావు ప్రాధాన్య‌తాంశం! ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యే మాత్ర‌మే, ఇంకా మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. అయితే, గ‌త కొన్నాళ్లుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి, ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీష్ రావుకి మ‌ధ్య దూరం పెరిగింద‌ని క‌థ‌నాలు వినిపించేవి. వాటిని దూరం చేస్తూ… ఆమ‌ధ్య‌ చింత‌మ‌డ‌క గ్రామంలో ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆ చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, తాజాగా ఇప్పుడు మ‌రోసారి హ‌రీష్ ని ముఖ్య‌మంత్రి దూరం పెడుతున్నార‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో మ‌ళ్లీ చ‌ర్చ‌నీయంగా మారిన‌ట్టు స‌మాచారం.

గ‌జ్వేల్ నియోజ‌కవ‌ర్గంలో ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌టించారు. మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో క‌లిసి అక్క‌డో పంప్ హౌస్ ని ప‌రిశీలించ‌డానికి వెళ్లారు. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో హ‌రీష్ రావు క‌నిపించ‌లేదు. సొంత జిల్లా సిద్ధిపేట‌లో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌టిస్తే.. హ‌రీష్ రావు ఎందుకు రాలేదూ అనేదే ఇప్పుడు చ‌ర్చ‌. పోనీ, ఆయ‌న వేరే ప‌నిమీద ఎక్క‌డికైనా వెళ్లారా.. అంటే, ముఖ్య‌మంత్రి వ‌చ్చిన రోజున ఆయ‌న అక్క‌డే ఉన్నారట‌! నిజానికి, గ‌జ్వేల్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి బ‌దులుగా హ‌రీష్ రావు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో కీల‌క పాత్ర పోషించారు. అయినాస‌రే, సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంలో ఆయ‌న రాలేదు. ముఖ్య‌మంత్రికీ ఆయ‌న‌కీ మ‌ధ్య ఈ మ‌ధ్య దూరం పెరుగుతోంది కాబ‌ట్టే, గ‌తంలో మాదిరిగా క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని హ‌రీష్ రావు త‌గ్గించుకున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం హ‌రీష్ రావు మంత్రి కాదు. కాబ‌ట్టి ఆయ‌న‌కి ప్రోటోకాల్ లాంటివేవీ ఉండ‌వు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు కూడా ఆహ్వానించాల‌ని రూలేం లేదు. కానీ, గ‌జ్వేల్ అభివృద్ధికి కృషి చేశారు కాబ‌ట్టి… క‌నీసం ఆ నేప‌థ్యంలోనైనా సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న్ని ఆహ్వానించి ఉంటే బాగుండేమో అనేది పార్టీలో కొంత‌మంది అభిప్రాయం. సీఎం, హ‌రీష్ ల మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంద‌న‌డానికి ఇది తాజా సాక్ష్య‌మని కొంద‌రు అంటున్నారు. అయితే, త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ సూచ‌న‌లున్నాయి. హ‌రీష్ రావుకి ప‌ద‌వి ఇస్తారు. ప్రాధాన్య‌త ఉన్న శాఖ‌నే అప్ప‌గిస్తార‌నే అంచ‌నాలున్నాయి. అక్క‌డితో ఈచ‌ర్చ ఆగే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close