ఆ స్వామిజీ అనధికార దేవాదాయ మంత్రి ..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయశాఖలో.. ఏ పోస్టింగ్ కావాలన్నా… నామినేటెడ్ పోస్టు కావాలన్నా… కాంట్రాక్టులకు.. పనులకు సిఫార్సు కావాలన్నా… ఒకటే తారక మంత్రం. మంత్రిని కలిస్తే.. పనవుతుందో లేదో కానీ… ఓ మహాశక్తిగా మారిన.. స్వామిజీని కలిస్తే మాత్రం పనయిపోతుంది. రెండు, మూడు రోజుల కిందట.. ఏపీలో ఓ ప్రముఖ ఆలయానికి ఈవోను మార్చారు. ఎందుకు మార్చారో.. కారణం ఏమిటో… ఎవరికీ అర్థం కాలేదు కానీ.. అదృశ్య హస్తం గురించి మాత్రం అందరికీ తెలిసిపోయింది. అది ప్రముఖ దేవాలయం కాబట్టి.. దండిగా ఆదాయం వచ్చే… అవకాశం ఉంది కాబట్టి.. ఆ ఈవో పోస్టు గురించి చర్చ జరిగుతోంది. కానీ.. అంతకు ముందు నుంచే.. అంటే.. గత రెండున్నర నెలల నుంచి.. ఆయన ఆశీస్సులతో.. కీలక పదవులు, పనులు పొందిన వారు చాలా మంది ఉన్నారట.

దేవాదాయ శాఖలో.. జరిగినన్ని మార్పులు… కొత్త ప్రభుత్వంలో.. జరగలేదని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ ఉన్నప్పటికీ.. ఆ స్వామిజీని కలుసుకునేందుకు వెళ్లి.. పూలు, ఫలహారాలు సమర్పించుకుని.. కోరికను వెల్లడిస్తే.. ఆయన … అభయహస్తం ఇచ్చి పంపేవారు. వారి కోరిక నెరవేరేది. అంత పవర్ ఫుల్ గా ఆయన దేవాదాయశాఖపై పట్టు సాధించారు. చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు… తమ మద్దతుదారులకు.. దేవాదాయశాఖలో కీలకమైన పదవులు , పనులు ఇప్పించేందుకు ప్రయత్నించి.. భంగపాటుకు గురయ్యారు. ఎందుకంటే.. అప్పటికే వాటిని.. స్వామిజీ వారి ఖాతాలో.. వేరేవారు.. పొందారు మరి… !. దీంతో.. స్వామిజీ తీరు… ప్రభుత్వంలో చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల అసంతృప్తికి కారణం అవుతోంది.

ప్రస్తుత సర్కార్‌లో.. ప్రతీ మంత్రిత్వ శాఖకు.. ఓ షాడో.. మినిస్టర్ ఉన్నారని.. ముఖ్యంగా… సామాజిక సమీకరణం పేరుతో… ఇతర వర్గాలకు పెద్ద పీట వేసిన శాఖలన్నింటినీ.. కొంత మంది అనధికార మంత్రులు పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. వారందరిదీ.. దాదాపుగా ఒకటే సామాజికవర్గం. కానీ.. దేవాదాయశాఖకు వచ్చే సరికి.. ఆ అవకాశాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలు స్వామిజీకి కట్ట బెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన తనకు నమ్మకమైన వారికి.. తన వద్దకు వచ్చే వారికి కీలకమైన పోస్టింగులు ఇచ్చి.. ఆయన దేవాదాయశాఖపై పట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విశేషం ఏమిటంటే… తిరుమలలో టిక్కెట్ల పై జెరూసలెం యాత్ర… ప్రచారంపైనా ఘాటుగా స్పందించారు. బహుశా.. ఆ టిక్కెట్ల కాంట్రాక్టర్ తనను కలవలేదనేనమో…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close