క్రైమ్ : కటకటాల్లో న్యూడ్ ఫోటోల కలెక్షన్ కింగ్..!

ఆన్‌లైన్ మోసాలంటే… ఓటీపీలు చెబితేనో.. చెప్పకుండానో… ఖాతాల్లోంచి డబ్బులు కొట్టేయడం మాత్రమే కాదు..! అంతకు మించి ఉందని… చాలా మంది ప్రబుద్దులు నిరూపిస్తూనే ఉన్నారు. ఈ మోసాలు .. .ఘోరాలు.. దారుణలుగా.. ఎలా మారుతున్నాయో… హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బాగోతం వెల్లడి చేస్తోంది.

ఉద్యోగం టీసీఎస్… హాబీ న్యూడ్ ఫోటోల కలెక్షన్..!

చెన్నై టాటా కన్సల్టెన్సీ సర్వీస్ క్యాంపస్‌లో ప్రదీప్ ఓ సీనియర్ ఉద్యోగి. సిన్సియర్. కానీ.. ఆఫీసు నుంచి బయటకు వెళ్తే ఆయన అపరిచితుడు. ఆయన మైండ్‌లో ఉన్న వికారం అంతా బయట పడుతుంది. ఆయన లక్ష్యం.. ఆన్‌లైన్‌లో అమ్మాయిల్ని ఆకర్షించి.. వారి న్యూడ్ ఫోటోల్ని సేకరించడం. వాటిని చూసి ఆనందించడం. తాము న్యూడ్ ఫోటోలు ఇచ్చామని.. ఏ బాధితురాలూ.. చెప్పుకోలేదు కనుక… తన జోలికి ఎవరూ రారనునున్నారు. అనుకున్నట్లుగానే ఎవరూ రాలేదు. కానీ నూటికో.. కోటికో ఒక్కరుంటారు … అలాంటి అమ్మాయే ప్రదీప్‌కి తగిలింది.. దాంతో మనోడి బండారం బట్టబయలైంది. టీసీఎఎస్ నుంచి కటకటాల్లోకి వచ్చి పడ్డాడు.

ఫైవ్ స్టార్ హోటళ్ల పని చేయాలంటే ఫైవ్ స్టార్ ఫిజిక్ ఉండాలట..!

ప్రదీప్.. ఫేస్‌బుక్‌లో యువతి పేరుతో ఫేక్‌ ఐడీ క్రియేట్ చేశాడు. స్టార్‌ హోటళ్లలో ఫ్రంట్‌ ఆఫీసు ఉద్యోగాలంటూ అందమైన అమ్మాయిలను ఆశ పెట్టాడు. స్టార్ హోటళ్లలో ఉద్యోగాలంటే… మంచి ఫిజిక్ ఉండాలని… చెప్పవారు. తమకు మంచి ఫిజిక్ ఉందని.. ఎవరైనా యువతులు ఆశ పడితే.. వెంటనే… న్యూడ్ ఫోటోలు పంపమనేవాడు. అడుగుతోంది అమ్మాయేనని… వారు కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా.. పంపేవారు. ఇలా.. ఆరు వందల మంది అమ్మాయిల న్యూడ్ ఫోటోల్ని.. వీడియోల్ని సేకరించాడు. చివరికి మోసపోయినట్లు గుర్తించిన ఓ అమ్మాయి.. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రదీప్ పొలీసులకు దొరికిపోయాడు.

600 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు..!

ప్రదీప్ ల్యాప్ ట్యాప్‌లో పదహారు రాష్ట్రాలకు చెందిన.. 600 మంది యువతుల న్యూడ్ ఫోటోలు ఉన్నాయి. వీడియోలు కూడా ఉన్నాయి. వీరందరికీ… స్టార్ హోటళ్లలో ఉద్యోగాలని.. మంచి జీతమని చెప్పి నమ్మించాడు. నిందితుడికి.. అమ్మాయిల న్యూడ్ ఫోటోలను సేకరించే మానసిక వ్యాధి ఉందని.. అనుమానిస్తున్నారు. అదే సమయంలో.. ఈ ఫోటోలను చూపించి ఎవరినైనా బ్లాక్ మెయిల్ చేశారా.. అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. టెకీ.. తన టెక్ తెలివితేటల్ని.. ఈ మోసానికి ఉపయోగించుకున్నారు. మోసం.. అంటే.. డబ్బులు మోసం చేయడమే కాదు.. ఇలాంటి మోసాలు కూడా ఉంటాయని.. ప్రదీప్ నిరూపించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో మద్యం దుకాణాలకు టోటల్ అన్‌లాక్..!

తెలంగాణలో మద్యం దుకాణాలకు అన్‌లాక్ చేసేశారు. ఇక నుంచి సాధారణంగానే మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల...

సీఎం చెప్పే అద్భుత వైద్యం గాలిని ఆ వైసీపీ ఎమ్మెల్యే తీసేశారు..!

ఆంధ్రప్రదేశ్ కోవిడ్ సెంటర్లలో రోగులకు ప్రపంచంలో ఎక్కడా చేయనన్ని సేవలు అందిస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వైసీపీ నేతలకు మాత్రం.. అలా అనిపించడం లేదు. ఎవరికి చెప్పుకుందామా.. అని చూసి...

మూడు రాజధానులు ఎజెండాగా ఎన్నికలు..! జగన్‌కు చంద్రబాబు చాలెంజ్..!

ఎన్నికలకు ముందు అమరావతికి మద్దతు పలికి తీరా ఎన్నికలయ్యాక అమరావతిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారని ... ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అధినేతచంద్రబాబు డిమాండ్ చేశారు. అసెంబ్లీని రద్దు చేసి..మూడు రాజధానులు ఎజెండాగా...

‘ఖైదీ 2’…లో తెలుగు హీరో?

కార్తీ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఖైదీ` మంచి విజ‌యాన్ని అందుకుంది. తెలుగులో డ‌బ్బింగ్ రూపంలో వ‌చ్చి ఇక్క‌డ కూడా మంచి వ‌సూళ్లు అందుకుంది. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌కుడు. `ఖైదీ` హిట్ అవ్వ‌గానే `ఖైదీ 2`కి...

HOT NEWS

[X] Close
[X] Close