హిందీ ‘ఛ‌త్ర‌ప‌తి’.. హీరోయిన్ ఫిక్స్‌

రాజ‌మౌళి – ప్ర‌భాస్‌ల ఛ‌త్ర‌ప‌తిని ఇన్నేళ్ల త‌ర‌వాత బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరో. ఈ సినిమాతోనే హిందీలో అడుగుపెడుతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. త‌న‌కీ ఇదే తొలి హిందీ చిత్రం. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం గ‌త కొన్ని రోజులుగా అన్వేష‌ణ జ‌రుగుతోంది. చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. పూజా హెగ్డే, శ్ర‌ద్దా క‌పూర్‌, కైరా అద్వానీ… ఇలా ర‌క‌ర‌కాల పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికి.. దిశాప‌టానీని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. పూరి జ‌గ‌న్నాథ్ సినిమా `లోఫర్‌` తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది దిశ‌. తెలుగువాళ్లెవ్వ‌రూ ఈ భామ‌ని ప‌ట్టించుకోలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వ‌రుస సినిమాల‌తో దూసుకెపోతోంది. ఆ క్రేజ్‌తోనే.. హిందీ `ఛ‌త్ర‌పతి`లోనూ చోటు సంపాదించుకుంది. హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ స్టార్‌ల‌లో ఒక‌రిని ఎంచుకోవాల‌ని చిత్ర‌బృందం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించింది. అందుకే శ్ర‌ద్దా క‌పూర్‌, కైరా.. లాంటి వాళ్ల వ‌ర‌కూ ఈ క‌థ వెళ్లింది. అయితే.. తాజా స‌మీక‌ర‌ణాల దృష్ట్యా… దిశా ప‌టానికే చిత్ర‌బృందం ఓటేసింది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే .... డ్రగ్స్...

టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది... `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా... టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు...

బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ...

తిరుపతి ఎన్నికలకు కేంద్ర బలగాలు..!?

తిరుపతి ఉపఎన్నికల్లో భద్రత కోసం కేంద్ర బలగాలను ఉపయోగించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ప్రచారంలో జరిగిన రాళ్ల దాడి వ్యవహారంతో ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి...

HOT NEWS

[X] Close
[X] Close