శేఖ‌ర్ కమ్ముల – సాయి ప‌ల్ల‌వి.. మ్యాజిక్ రిపీట్స్‌!

‘ఫిదా’ లో సాయి ప‌ల్ల‌వి టాలెంట్ పూర్తి స్థాయిలో బ‌య‌ట‌ప‌డిపోయింది. ముఖ్యంగా త‌న న‌ట‌న‌.. డాన్స్‌. `వ‌చ్చాడే..` పాటైతే హోరెత్తిపోయింది. అందులో సాయి ప‌ల్ల‌వి చేసిన మూమెంట్స్ ఇప్ప‌టికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ పాట ఇంపాక్ట్ ఆ సినిమాపైచాలా ఉంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల మ‌రో సినిమా చేస్తున్నాడు. అదే `ల‌వ్ స్టోరీ`. సాయి ప‌ల్ల‌వినే హీరోయిన్‌. అలాంట‌ప్పుడు `ఫిదా`ని గుర్తు చేసే పాట లేక‌పోతే ఎలా? అందుకే ఓ పాట డిజైన్ చేశాడు శేఖర్ క‌మ్ముల‌. `సారంగ ద‌రియా` అంటూ తెలంగాణ స్లాంగ్ లో సాగిన మంచి డాన్సింగ్ బీట్ ఇది. `వచ్చాడే..` పాట రాసిన‌… సుద్దాల అశోక్ తేజ‌నే ఈ పాట రాశారు. ఆయ‌న ప‌దాల మ‌హ‌త్తు, మంగ్లీ పాడిన విధానం, ముఖ్యంగా.. సాయి ప‌ల్ల‌వి చేసిన డాన్స్ మూమెంట్స్‌.. ఇవ‌న్నీ క‌లిసి ఈ పాట‌ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. మేకింగ్ వీడియోలోనే.. సాయి ప‌ల్ల‌వి చేసిన కొన్ని డాన్స్ మూమెంట్స్ చూస్తే.. వారెవా అనిపిస్తోంది. ఇక పూర్తి పాట బ‌య‌ట‌కు వ‌స్తే ఎలా ఉంటుందో? ల‌వ్ స్టోరీలో ఇప్ప‌టికే కొన్ని పాట‌లు వ‌చ్చాయి. అయితే… `సారంగ దిరియా` మాత్రం నేరుగా సంగీత ప్రియుల మ‌న‌సుల్లోకి చొచ్చుకుపోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.