నాని.. వైష్ణ‌వ్‌.. క‌థ‌లు వేర‌యా!

ఉప్పెన‌తో వైష్ణ‌వ్ తేజ్ స‌త్తా తెలిసొచ్చింది. కొత్త ద‌ర్శ‌కులు ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ కోసం క‌థ‌లు సిద్ధం చేసుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ కొత్త ద‌ర్శ‌కుడి క‌థ‌ని వైష్ణ‌వ్ ఓకే చేశాడు. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఎట్రిమెంట్లు కూడా అయిపోయాయి. క్రిష్ సినిమా త‌ర‌వాత వైష్ణ‌వ్ చేయ‌బోయే సినిమా ఇదే.

అయితే… ఈ క‌థ ముందు నాని ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని, త‌ను నో చెప్ప‌డంతో వైష్ణ‌వ్ తో చేసేస్తున్నార‌ని ఓ గ్రేట్ `గాచిప్‌` వెబ్ సైట్ క‌థ‌లు అల్లేసింది. ఓ హీరో కాదంటే, మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు క‌థ‌లు వెళ్లిపోవ‌డం స‌హ‌జ‌మే. కాబ‌ట్టి ఇదీ ఆ బాప‌తే అనుకుని త‌న స‌హ‌జ‌మైన ధోర‌ణిలోనే గాసిప్పు రెడీ చేసేసింది. అయితే.. నాని, వైష్ణ‌వ్ ల‌కు క‌థ‌లు చెప్పిన ద‌ర్శ‌కుడు ఒక్క‌డేకావొచ్చు. కానీ క‌థ‌లే వేరు. నానికి ముందు చెప్పిన క‌థ‌.. ఓ పోలీస్ డ్రామా. అది నానికి ఎక్క‌లేదు.త‌న‌కు అలాంటి క‌థ‌లు సూట్ కావ‌ని భావించిన నాని ఆ క‌థ‌ని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు వైష్ణ‌వ్‌కి ఓ పూర్తి స్థాయి ఫ్యామిలీ క‌థ చెప్పాడు. దాన్ని.. వైష్ణ‌వ్ ఓకే చేశాడు. ఓ ద‌ర్శ‌కుడు క‌థ‌లు ప‌ట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతుంటే, అది ఒకే క‌థ అవ్వాల‌న్న రూలేం లేదు క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close