మీడియా వాచ్ : తెలంగాణ బీజేపీకి మాత్రం ఏబీఎన్ మోస్ట్ వాంటెడ్..!

ఏబీఎన్‌ను తాము బహిష్కరించేశామని ఏపీ బీజేపీ నేతలు ప్రకటించేశారు. దానిపైన.. కొత్తపలుకు ఆర్టికల్‌లో ఆర్కే సెటైర్లు వేశారు. సోము వీర్రాజు మాటలను ఆయన పార్టీ నేతలే వినిపించుకోవడం లేదని.. తమను బీజేపీ కార్యక్రమాలకు కవరేజీకి పిలుపుస్తున్నారని ఆయన సోము వీర్రాజు గాలి తీసేశారు. అదే సమయంలో.. తెలంగణ బీజేపీ నేతలు మాత్రం ఏబీఎన్‌ మోస్ట్ వాంటెండ్‌గా భావిస్తున్నారు. తమకు బాగా సపోర్ట్ చేసే చానల్‌గా ప్రాథాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో ఏపీ బీజేపీ నిర్ణయం వారిపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన చెప్పుదాడి ఘటనపై ఒక్క తెలంగాణ బీజేపీ నేత కూడా .. స్పందించలేదు. తప్పు ఏబీఎన్‌ చానల్‌ది ఉందని కానీ.. మరొకటి కానీ ఎవరూ అభిప్రాయం కూడా వ్యక్తం చేయలేదు.

తెలంగాణ బీజేపీ నేతలు అందరి కంటే ముందుగా ఆంధ్రజ్యోతికి పిలుపులు ఇస్తున్నారు. తమ పార్టీ కార్యక్రమాలు.. తమ నేతల ప్రెస్‌మీట్లను కవర్ చేయాలని కోరుతున్నారు. అంతే కాదు.. ఏబీఎన్‌కు ఏదైనా కష్టం వస్తే.. బీజేపీ నేతలే ముందుంటున్నారు. జనగామలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జాలంటూ కొంత కాలంగా ఏబీఎన్ చానల్ ప్రసారాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో దాడికి పురమాయించాడని ఏబీఎన్ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ముత్తిరెడ్డిపై ఆరోపణల వర్షం కురిపించారు. ఏబీఎన్‌కు అండగా ఉంటామన్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు.. ఓ మీడియా సంస్థపై ఇలా భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చడం… ఆసక్తికరంగా మారింది. ఏపీలోనూ… బీజేపీ నేతల్లో చాలా మంది మీడియాపై నిషేధం అంటూ సోము వీర్రాజు వర్గం హడావుడి చేయడంపై అసంతృప్తిగా ఉంది. బీజేపీకి మీడియాలో వచ్చే కవరేజే అంతంత మాత్రం అయినప్పుడు… మీడియా చానళ్లను బ్యాన్ చేసి ఉన్న కవరేజీని పోగొట్టుకోవడం ఏమిటన్నదిప్రశ్న. ఇప్పుడు ఏబీఎన్ మరింత దూకుడుగా బీజేపీపై ఆరోపణలు చేయడానికి చాన్స్ దొరికింది. సమాధానం చెప్పడానికి అవకాశాన్ని బీజేపీనే కోల్పోయినట్లయిందన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close