డీకే అరుణ‌కు ఈ కార్య‌క్ర‌మం ప్ల‌స్ అవుతుందా..?

తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాలనే వ్యూహంలో భాజ‌పా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి, బ‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కంతో కొంత‌మంది ఇత‌ర పార్టీల‌ నేత‌లు క‌మ‌లం గూటికి చేరిన‌వారిలో ఉన్నారు. వారిలో మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఒక‌రు. రెండు రోజుల‌పాటు ఇందిరా పార్క్ ద‌గ్గ‌ర ఆమె దీక్ష చేశారు. దేని గురించి అంటే… దిశ ఘ‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలో మ‌ద్య‌మే నేరాల‌కు కార‌ణ‌మౌతోంద‌నీ, మద్యాన్ని నిషేధించాలంటూ ఆమె దీక్ష‌కు దిగారు. అయితే, మ‌ద్య నిషేధం అంత సులువుగా జ‌రిగే వ్య‌వ‌హారం కాదు. ఇప్పుడు భాజ‌పా ఉద్య‌మిస్తున్న‌దీ ప్ర‌జ‌ల్లోంచి వ‌చ్చిన ఒక తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఒడిసిప‌ట్టిందీ కాదు. ఈ అంశాన్ని ఒక రాజ‌కీయ పోరాటాంశంగా, తెరాస‌ను విమ‌ర్శించ‌డానికి ప‌నికొచ్చే ఆయుధంగానే చూస్తోంది. ఉద్య‌మ స్థాయి కార్యాచ‌ర‌ణ ప్ర‌స్తుతానికైతే క‌నిపించ‌డం లేదు.

రెండ్రోజుల‌పాటు డీకే అరుణ చేసిన దీక్ష ప్ర‌భుత్వంపై కాస్తైనా ఒత్తిడి తెచ్చిందా, ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేసిందా అంటే లేద‌నే చెప్పాలి. ఆమె దీక్ష చేస్తుంటే… రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగేలా భాజ‌పా శ్రేణులు చేయ‌లేక‌పోయాయ‌నీ అనొచ్చు. పార్టీప‌రంగా భాజ‌పాకి పెద్ద‌గా మైలేజ్ రాలేదుగానీ, వ్య‌క్తిగ‌తంగా డీకే అరుణ‌కు ఒక సానుకూలంశంగా మారింద‌ని చెప్పొచ్చు. ఈ సానుకూల‌తను టి. భాజ‌పా అధ్య‌క్ష్య ప‌ద‌వి రేసులో తాను ఉన్నాన‌ని అరుణ చెప్పుకునేందుకు ఒక అర్హ‌త‌గా ప‌నికొచ్చే అవ‌కాశం ఉంది. నిజానికి, తెలంగాణ‌కు కొత్త అధ్య‌క్షుడిని ఏర్పాటు చేయాల‌నే చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు గ‌త కొన్నాళ్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ తోపాటు, ఎంపీ అర‌వింద్ లాంటివారు పోటీలో ఉన్న‌ట్టు చ‌ర్చ ఉంది. డీకే అరుణ కూడా త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టూ వినిపించింది.

కేసీఆర్ మీద ఘాటైన విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల‌గ‌డం, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డం… ఇవీ ఆమెకు క‌లిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. అయితే, ఆర్.ఎస్.ఎస్. నేప‌థ్యం ఉన్న‌వారికి మాత్ర‌మే పార్టీ అధ్య‌క్ష్య ప‌ద‌వి అనే సూత్రాన్ని ఈ మ‌ధ్య తెర మీదికి తెచ్చారు! ఆ నేప‌థ్యం అరుణ‌కు లేదు. భాజ‌పాలో ఆమెకి క‌నీసం ఏడాది అయినా అనుభ‌వం లేదు. ఈ కార‌ణాల‌తో ఆమెకు అధ్య‌క్ష్య ప‌ద‌వి నిరాక‌రించే ఛాన్స్ ఉంది. అందుకే, ఆమె వీటిని దాటి త‌న సామ‌ర్థ్యం ఉంటుంద‌నే సంకేతాలు జాతీయ నాయ‌క‌త్వానికి ఇచ్చేందుకు ఈ రెండ్రోజుల దీక్ష ఉప‌యోగ‌ప‌డే ఛాన్స్ ఉంది. అయితే, మొద‌లుపెట్టిన ఈ ఉద్య‌మాన్ని ఆమె మ‌రింత ముందుకు తీసుకెళ‌తారో, ఇక్క‌డితో స‌రిపెట్టేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...
video

స‌ర్కారు వారి ‘గంట’ కొట్టిన మ‌హేష్‌

ఈరోజు మ‌హేష్‌బాబు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `స‌ర్కారువారి పాట‌` నుంచి ఏదో ఓ స‌ర్‌ప్రైజ్ వ‌స్తుంద‌ని మ‌హేష్ అభిమానులు ఆశించారు. చిత్ర‌బృందం కూడా.. త‌ప్ప‌కుండా బ‌ర్త్‌డే గిఫ్ట్ ఉంటుంద‌ని ఊరిస్తూ వ‌చ్చింది....

HOT NEWS

[X] Close
[X] Close