కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కవిత ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖ రాసి, లీక్ చేయించారని ఓ వైపు, కేటీఆర్ – హరీష్ రావులు కలిసి ఈ లేఖను బయటకు రిలీజ్ చేయించారని మరోవైపు ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేకపోవడంతో కొత్త పార్టీ ఏర్పాటుకు కవిత రెడీ అయ్యే, కేసీఆర్ చుట్టూ కొంతమంది కోవర్టులు ఉన్నట్టు ఆరోపించారనే చర్చ జరుగుతోంది. అయితే, బీఆర్ఎస్ ను వీడి కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తే ఆమె మరో షర్మిల అవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కవిత బీజేపీలో చేరుతారు అనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. దీనిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమని స్పష్టం చేశారు. ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోమని, పార్టీలో చేరుతామని వచ్చే వాళ్ల ప్రొఫైల్ చూసి చేర్చుకుంటామని చెప్పారు. అన్ వాంటెడ్ గెస్టులను పార్టీలోకి ఆహ్వానించబోమని తెలిపారు.
ఇక, కేసీఆర్ కు కవిత రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది కేసీఆర్ , కేటీఆర్ , కవితకు మాత్రమే తెలియాలని చెప్పారు డీకే అరుణ. కుటుంబ సభ్యులు లేదా కవిత సన్నిహితులే ఈ పని చేసి ఉంటారని , దీని వెనక ఎవరున్నారు అనేది కవిత సమాధానం చెప్పాలన్నారు అరుణ.