పోలవరం క్వాలిటీ చెక్‌ సాక్షి జర్నలిస్టులకు ఇస్తే సరిపోతుందా..?

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. “సాక్షి” మీడియా వ్యవహరిస్తున్న తీరు అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఏ పని జరిగినా… దాన్ని.. అత్యంత దారుణంగా… “అదో పనికి మాలిన పని” అన్నట్లుగా తీసి పడేయడం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. అత్యధిక కాంక్రీట్ వర్క్ జరిగి.. గిన్నిస్ రికార్డు సృష్టించిన సమయంలోనూ.. సాక్షి పత్రిక ఇలాంటి కవరేజీనే ఇచ్చింది. “నాణ్యత లేని పనుల్లో రికార్డు” అంటూ.. కథనం అల్లేసింది. ఓ వైపు అత్యంత ఉన్నత ప్రమాణాలతో.. నిర్మిస్తున్నారని చెబుతూ.. కేంద్రం అవార్డులు ఇస్తూ ఉంటుంది. మరో వైపు.. సాక్షి పత్రిక ప్రతీ పనిని దారుణంగా విమర్శిస్తూ కథనాలు రాస్తూ ఉంటుంది.

పోలవరం ప్రాజెక్ట్ ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. క్వాలిటీ విషయంలో… రాజీ పడటానికి అదేమి.. మామూలు అపార్ట్‌మెంట్ కాదు. సాధారణ ఇంజినీర్లు అక్కడ పని చేయడం లేదు. దేశ, విదేశాల నుంచి అటు కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు.. ఇటు పోలవరంప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంజినీర్లు వందల సంఖ్యలో పని చేస్తున్నారు. గిన్నిస్ రికార్డు కాంక్రీట్ పనుల కోసం… విదేశీ ఇంజినీర్లే కనీసం.. వెయ్యి మంది విధుల్లో ఉన్నట్లు… చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాల్లో ఏ మాత్రం రాజీ పడకుండా పనులు సాగుతున్నాయని… ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ సాక్షి పత్రిక మాత్రం… ఏదో ఒకటి పని చేస్తున్నారని కాబట్టి.. అందులో నాణ్యత లేదని… రాసేస్తే సరిపోతుందని… కథనం అల్లేస్తోంది.

ఏపీకి జీవనాడి వంటి ప్రాజెక్ట్.. దశాబ్దాలుగా… మాటలేక పరిమితమైన ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ఓ రూపు వస్తోంది. ఇలాంటి ప్రాజెక్ట్ విషయంలో సాక్షి పత్రిక అనుసరిస్తున్న ఎడిటోరియల్ విధానం… కచ్చితంగా పాఠకులకు అసహనానికి గురి చేసేదే. తప్పులు ఉంటే ఎత్తి చూపొచ్చు కానీ.. గేట్లు పెట్టడం ప్రారంభించినా కూడా తప్పేనన్నట్లుగా… వ్యవహరించడం.. చుక్క నీళ్లు లేకుండా గేట్లు పెడుతున్నారని… సాక్షి మీడియా యజమాని జగన్ వెటకారాలు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ క్వాలిటీ చెక్ బాధ్యతల్ని సాక్షి జర్నలిస్టులకు ఇస్తే.. వారు రాసిందే సర్టిఫికెట్లుగా భావించుకుంటే.. అప్పుడే… సాక్షి పత్రిక సంతృప్తి చెందుతుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close