క్రైమ్ : హైదరాబాద్ డాక్టర్ హత్య వెనుక సంచలన నిజాలు..!

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద డాక్టరైన మహిళను సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఒంటరిగా దొరికిన ఆమెను.. కొంత మంది లారీ డ్రైవర్లు.. తోడేళ్లులా విరుచుకుపడి.. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంక అనే యువతి మృతదేహం బయటపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ప్రియాంక వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శంషాబాద్ నుంచి మాదాపూర్‌లోని హాస్పిటల్‌కు ప్రియాంక స్కూటీపై వెళ్లింది. రాత్రి 9.30 ప్రాంతంలో శంషాబాద్‌కు తిరిగొచ్చింది. అప్పటి నుంచి ప్రియాంకరెడ్డి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు.

ఉదయం 4.30 గంటల సమయంలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్కూటీ పాడయిందని కుటుంబ సభ్యులకు ఆమె ఫోన్‌లో చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. తన స్కూటీ పంక్చర్ అయితే చటాన్‌పల్లి వద్ద ఆగిందని …భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్‌ చేసిందని ఆమె సోదరి పోలీసులకు చెప్పారు. అక్కడ లారీ డ్రైవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా ఉందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మొత్తం 15 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. శంషాబాద్ డీసీపీ బృందం నిందితుల కోసం గాలిస్తున్నారు.

హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో.. రాత్రి తర్వాత పరిసరాలు.. అత్యంత భయంకంగా మారుతున్నాయి. ఒంటరిగా ఎవరైనా కనిపిస్తే.. వదిలి పెట్టని దుండగులు అక్కడ రాత్రైతే. చేరుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రియాంకరెడ్డిని కొంత మంది లారీ డ్రైవర్లు..తీసుకెళ్లి.. లారీలు అడ్డం పెట్టి.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close