లీకయింది స్టైరిన్ మాత్రమే కాదు ..!?

ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చెట్లన్నీ నల్లగా అయిపోయాయి. ఎక్కడివక్కడ మాడిపోయాయి. ద్విచక్ర వాహనాలపై కూడా దద్దర్లులా వచ్చాయి. ఆ వాహనాలపై ఉన్న పెయింటింగ్.. ఇతర రసాయినాలు కూడా.. ఉబ్బిపోయాయి. ఆ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తే.. ఓ రకమైన భీతావహ వాతావరణం ఉంది. రసాయన దాడి జరిగిన ఫీలింగ్ అందరికీ వచ్చేస్తుంది. ఇంత విధ్వంసం సృష్టించింది.. స్టైరిన్ వాయువు మాత్రమే అని.. రసాయనాల గురించి తెలిసిన వారికి వస్తున్న సందేహం.

ఎల్జీ పాలిమర్స్ చుట్టుపక్కల రసాయన దాడి జరిగినట్లుగా పరిస్థితులు..!

స్టైరిన్ వాయువు ప్రమాదకరం కాదనేది ప్రాథమికంగా నిపుణులు వేసిన అంచనా. ఈ కారణంగానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో.. అక్కడి ప్రజల్ని ఉన్న పళంగా తరలించడంలోనూ…నిర్లక్ష్యం జరిగింది. కానీ.. పన్నెండు మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మాడిపోయిన చెట్లను చూస్తూంటే.. వారి ఆరోగ్య పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అంచనా వేయడం కష్టమేం కాదు. వారు భౌతికంగా ప్రాణాలతో బయటపడవచ్చు కానీ.. వారి అవయవాలు ఆ చెట్ల లాగే మాడిపోయి ఉంటాయని.. ఎవరు మాత్రం అనుకోరు. వైద్యులు కూడా అదే చెబుతున్నారు. వారికి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రతీ నెలా.. పరీక్షలు చేయించుకోవాల్సిందేనని అంటున్నారు.

స్టైరిన్ వల్ల అంత రియాక్షన్ ఉండదు.. అందులో ఇంకేదో కలిసిందా..?

స్టైరిన్ వాయువు వల్ల అంత తీవ్రమైన రియాక్షన్ ఉండదని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. లీకైన వాయువు స్టైరిన్ మాత్రమే కాదని.. అందులో ఇంకేదో కలిసిందనే అనుమానాలు అంతకంతకూ బ లపడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ మాత్రం… ఇంత వరకూ ఆ రసాయనం ఏమిటన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. నిపుణులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఢిల్లీ, ముంబై, గుజరాత్ సహా.. అనేక ప్రాంతాల నుంచి నిపుణులు వస్తున్నారు. కానీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. గాలిలో స్టైరిన్ ప్రభావం ఇంకా ఉందని.. చెబుతున్నారు. ఆక్సీజన్ లెవల్స్ పెరగడం లేదంటున్నారు. సాధారణంగా స్టైరిన్ ప్రభావం ఇన్ని రోజులు ఉండదనేది రసాయన నిపుణులు చెప్పే మాట. లీకైన రసాయం ఏమిటో తేల్చాలని…అప్పుడే బాధితులకు సరైన వైద్య సాయం చేయడానికి కూడా వీలవుతుందని వైద్యలు కూడా అంటున్నారు.

నిపుణులతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లు..!

ఈ గ్యాస్ ప్రమాదంపై ఎల్జీ పాలిమర్స్ వ్యవహారశైలి మొదటి నుంచి నిర్లక్ష్యంగానే ఉంది. గ్యాస్ లీక్ అయినప్పుడు.. కనీసం సైరన్ కూడా మోగించలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా మాట్లాడారన్న అలుసుతోనే ఏమో కానీ..చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి భరోసాను ఇవ్వలేదు. చివరికి తీవ్రంగా విమర్శలు రావడంతో.. క్షమాపణ చెబుతూ నిన్న ఓ ప్రకటన జారీ చేసింది. కానీ.. ఇదంతా కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా.. ఎల్జీపాలిమర్స్ నుంచి లీకయిన గ్యాస్ నుంచి పూర్తి స్థాయిలో అక్కడి వాతావరణానికి విముక్తి కాలేదు. పది రోజుల్లో ఎన్జీటీ కమిటీ.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిటీలు నివేదికలు సమర్పించనున్నాయి. కేంద్రం కూడా నిపుణులతో దర్యాప్తు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు లీకైన గ్యాస్ ఏంటో తెలితే కానీ.. జరిగిదేమిటో స్పష్టమయ్యే అవకాశాలు లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close