ఇక పొడిగింపు లేదు.. 18 నుంచి అన్నీ ఓపెన్..!?

కేంద్ర ప్రభుత్వం ఇక లాక్‌డౌన్‌ను పొడిగించే ఉద్దేశంలో లేదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు.. అన్ని రకాల వ్యాపారాలు గతంలో జరిగేలా పూర్తిగా ఆంక్షలు సడలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ దుకాణాల వరకూ అనుమతి ఇచ్చారు. పద్దెనిమిదో తేదీ నుంచి సినిమా ధియేటర్లు, మాల్స్‌ను కూడా ప్రారంభించుకునేలా వెసులుబాటు ఇవ్వనున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా మార్చ్ 25 నుంచి సినిమా హాల్స్, మాల్స్ మూతపడ్డాయి. అప్పటి నుంచి జ‌న‌స‌మూహంగా ఎక్కువ‌గా గుమిగూడే ఏరియాల్లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా వైరస్ తీవ్రతను వీలైనంతగా తగ్గించగలిగామని.. విస్తరించే ప్రాంతాలను గుర్తించి.. ఆ మేరకు కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేశారు. వాటిలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. క‌రోనా పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని నిర్ధారించుకున్న గ్రీన్ జోన్‌ల‌లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే.. మొదట్లో.. కొన్ని ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో షోలు ప్రదర్శించడం.. పూర్తి స్థాయిలో టిక్కెట్లు అమ్మకపోవడం.. సాయంత్రం ఏడు తర్వాత మూసివేయాలనే నిబంధనలు కొన్ని మొదట్లో పెట్టే అవకాశం ఉంది. అలాగే మాల్స్‌లోనూ .. పరిమిత ఎంట్రీకి అవకాశం ఇవ్వనున్నారు. హాల్, మాల్‌లోకి వచ్చే ప్రతీ ఒక్కరికి ధర్మల్ స్క్రీనింగ్, మాస్క్ లాంటివి తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ విషయంలోనూ.. కేంద్రం సీరియస్‌గా పరిశీలన చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు తొలగించి.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలు ప్రారంభించనున్నారు. అయితే.. సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వారికే ప్రయాణ చాన్స్ ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా పాస్‌లు ఇస్తారు. వాటి ద్వారా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ నెలాఖరుతో.. దేశంలో సాధారణ జనజీవనం వచ్చే అవకాశం ఉంది. కరోనాతో కలిసి జీవించడం ఇండియన్స్ అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close