“ఓటీఎస్” రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెల్లుతాయా !?

ఓటీఎస్ పథకం ద్వారా రూ. పది, రూ. ఇరవై వేలు కడితే రూ. పది లక్షల విలువైన ఇళ్లకు హక్కులు వస్తాయని బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రూ. 8 లక్షల అప్పు వస్తుందని ప్రభుత్వం పేదలకు “అవగాహన” కల్పిస్తోంది. అయితే చేస్తున్న రిజిస్ట్రేషన్ల వ్యవహారంపైనే అనుమానాలు ప్రారంభమవుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లతో చేయించడం లేదు. గ్రామ సచివాలయాల్లోనే పంచాయతీ కార్యదర్శలు, వార్డు అడ్మిన్‌లు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. చట్ట ప్రకారం ఇవి ఎంత వరకూ చెల్లుబాటు అవుతాయన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని తాత్కాలిక రిజిస్ట్రార్లుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసి.. పత్రాలు పంపిణీ చేసింది.

పంచాయతీ కార్యదర్శులు చేసే రిజిస్ట్రేషన్ చెల్లుతుందా ?

ఇక ప్రభుత్వం ఇవ్వబోతున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా పార్టీ ప్రచార చిత్రాల్లా ఉన్నాయి కానీ.. అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లు లేవు. మొత్తం ఏడు పేజీలు ఉండే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో అసలు నిజమైన డాక్యుమెంట్ అని చెప్పుకునే ఒక్క లక్షణం కూడా లేదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు కొన్ని స్పష్టమైన నిబంధనలు ఉంటాయి. ఆ లావాదేవీ వ్యవహారం తప్ప మరేమీ ఉండకూడదు. స్టాంప్‌ ప్రధాన పేజీతో పాటు ఇతర పేజీలన్నీ తెల్లగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ రంగులతో నిండిపోయాయి. జగన్ బొమ్మ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే వాటికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. కానీ ప్రభుత్వం మాత్రం అవి నిజమైన రిజిస్ట్రేషన్లు అని చెబుతోంది. ఆ డాక్యుమెంట్లు ఎక్కడైనా పని చేస్తాయని అంటోంది.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డాక్యుమెంట్ పేపర్లు చెల్లుతాయా ?

ప్రభుత్వం చేయబోతున్న రిజిస్ట్రేషన్లపై అనుమానాలు పెరగడానికి గతంలో పంపిణీ చేసిన పట్టాల వ్యవహారం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వం ముఫ్పై లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలిస్తున్నామని ప్రకటించి.. పంపిణీని ప్రారంభించింది. కొన్నికొన్ని చోట్ల.. ఊరు, పేరు లేకుండా… ఖాళీ డాక్యుమెంట్లను లబ్దిదారుల చేతుల్లో పెట్టారు. కొన్ని చోట్ల అసలు స్థలం ఎక్కడుందో చెప్పకుండా.. ఒక సెంటు ఇస్తున్నట్లుగా రాసి ఇచ్చారు. అవి వాస్తవంగా డి-పట్టాలు. చాలా కొద్ది మందికే అవి ఇచ్చారు. మిగతా వారికి స్థలం ఇస్తున్నట్లుగా ఓ పత్రం ఇచ్చారు అంతే. ఇప్పుడు కూడా ఆ రిజిస్ట్రేషన్లు డి-పట్టాల మాదిరిగా ఉంటున్నాయి కానీ.. రిజిస్ట్రేషన్ లా కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సబ్ రిజిస్టార్లతో.. వర్జినల్ డాక్యుమెంట్లతో ఎందుకు చేయించడం లేదు ?

ఇప్పటికే పేదలు పెద్ద ఎత్తున డబ్బులు కడుతున్నారు. ఇలా కట్టిన తర్వాత కూడా వారి స్థలంపై వారికి సంపూర్ణ హక్కులు రాకుండా ఇలా తాత్కాలిక రిజిస్ట్రార్లతో రిజిస్ట్రేషన్లతో పనులు చేయించి వివాదాల్లో నెట్టడం ఎందుకన్న వాదన వినిపిస్తోంది. రైట్ రాయల్‌గా వర్జినల్‌గా నిబంధనలకు అనుగుణమైన డాక్యుమెంట్లతో సబ్ రిజిస్ట్రార్లతోనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తే పేదల్లో నమ్మకం ఉంటుంది కదా అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఈ ప్రభుత్వం ఏదీ స్ట్రెయిట్‌గా చేయడం లేదు. అన్నీ తేడాగానే ఉన్నాయి. అందుకే అందరిలోనూ అనుమానాలు ప్రారంభమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close