ప‌వ‌న్‌కి శ్రీ‌శ్రీ అంటే ఎవ‌రో తెలీదా?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఓ క‌థానాయ‌కుడిగానే కాదు. చ‌దువ‌రిగానూ తెలుగువారంద‌రికీ తెలుసు. ఆయ‌న సెట్లో సైతం పుస్త‌కం ప‌ట్టుకునే క‌నిపిస్తారు. ఇంట‌ర్వ్యూల‌లో పుస్త‌కాల గురించే మాట్లాడ‌తారు. గుంటూరు శేషేంద్ర శ‌ర్మ రాసిన `ఆధునిక మ‌హా భార‌తం` పుస్త‌కాన్ని ఆయ‌న స్వ ఖ‌ర్చుతో ప్ర‌చురించారు. అయితే ఆయ‌న‌కు శ్రీ‌/శ్రీ‌శ్రీ అంటే తెలీదా? అనే అనుమానం వేస్తోందిప్పుడు.

తెలుగువాళ్లు గ‌ర్వించే క‌వి శ్రీ‌శ్రీ‌. ఈ శతాబ్దం నాది అని గ‌ర్వంగాచాటుకున్నాడు. నిజ‌మే.. శ్రీ‌శ్రీ లాంటి క‌వి ఈ వందేళ్ల‌లో పుట్ట‌లేదు కూడా. వేల పుస్త‌కాలు చ‌దివిన ప‌వ‌న్‌కి శ్రీ‌శ్రీ తెలియ‌క‌పోవ‌డం విడ్డూరం. ఇదంతా ఎందుకు ప్ర‌స్తావిస్తున్నామంటే..

శనివారం ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ మ‌ధ్య శ్రీ‌శ్రీ గురించిన చ‌ర్చ‌, ఆయ‌న పుస్త‌కాల‌కు, క‌విత్వానికి సంబంధించిన కబుర్లు జ‌రిగాయి. శ్రీ‌శ్రీ ద‌స్తూరితో ఉన్న మ‌హా ప్ర‌స్థానం స్పెష‌ల్ ఎడిష‌న్ ని త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కి బ‌హుక‌రించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ గురించి అద్భుతంగా మాట్లాడారు త్రివిక్ర‌మ్‌. అయితే ఆ పుస్త‌కాన్ని చూస్తూ… ఓ ఫొటో ద‌గ్గ‌ర ఆగి `ఈయ‌న శ్రీ‌శ్రీ‌నా` అని అడిగారు ప‌వ‌న్‌. కానీ అది శ్రీ‌శ్రీ ఫొటోకాదు. ఆయ‌న మిత్రుడు కొంపెల్ల జ‌నార్థ‌న్ ది. శ్రీ‌శ్రీ త‌న పుస్త‌కాన్ని ఆయ‌న‌కే అంకితం ఇచ్చాడు. అందుకే తొలి పేజీల్లో కొంపెల్ల ఫొటో క‌నిపించింది. ఈ విష‌యాన్నే త్రివిక్ర‌మ్ కూడా ప‌వ‌న్ కి వివ‌రించారు. శ్రీ‌శ్రీ రూపం ఎలాంటిదో ఇన్ని పుస్త‌కాలు చ‌దివిన ప‌వ‌న్ కి తెలియక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. పైగా క‌వ‌ర్ పేజీపై శ్రీ‌శ్రీ బొమ్మే ముద్రించారు. అది చూసైనా లోప‌లున్న‌ది శ్రీ‌శ్రీ కాద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ఈజీగా గ్ర‌హించ‌గ‌ల‌గాలి. మ‌రెవ‌రినో ప‌ట్టుకుని శ్రీ‌శ్రీ‌నా అడ‌గ‌డం ఏమిటి? వేల పుస్త‌కాలు చ‌దివిన వాళ్ల‌కు తెలుగు క‌వులంతా తెలియాల‌ని రూలేం లేదు. కాక‌పోతే తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గిన వాళ్లైనా తెలియాలి క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డబ్బులివ్వలేదని ధర్నాలు చేస్తున్న హుజురాబాద్ ఓటర్లు !

భారత ప్రజాస్వామ్య పతనం అత్యంత కీలక దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓటర్లు తమకు రాజకీయ పార్టీలు డబ్బులివ్వలేదని ధర్నాకు దిగుతున్నారు. హుజురాబాద్‌లో అడుగడుగునా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక...

త్రివిక్రమ్ రాసిన సీన్ లో నేను నటించడం మర్చిపోలేను: నాగశౌర్యతో ఇంటర్వ్యూ

నాగశౌర్యకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. యూత్ ఫుల్ కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా వస్తుంది....
video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

HOT NEWS

[X] Close
[X] Close