కెప్టెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిద్దూ.. ఇక కిరీటమే..!

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయం దెబ్బకు తట్టుకోలేక అవమానాలు భరించలేక ఆయన పదవీ త్యాగం చేసేశారు. ఇప్పుడు సిద్ధూకు ముఖ్యమంత్రి పదవి అధిష్టించడం తేలిక అయిపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో అత్యధిక భాగం తన మద్దతుదారులుగా మార్చేసుకున్నారు. అప్పట్నుంచి అమరీందర్‌కు చిక్కులు తెచ్చి పెడుతున్నారు. మంత్రులు కూడా అమరీందర్ మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి ఆయన రాజీనామా చేశారు

వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోపే ముఖ్యమంత్రిని మారుస్తారని ఎవరూ అనుకోలేదు. అమరీందర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు పదే పదే చెబుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా అమరీందర్ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి స్థాయి నేత సిద్ధూ మాత్రమే ఉన్నారు. అయితే ఆయనతో పాటు మరో ముగ్గురు , నలుగురు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి . అయితే సిద్ధూ వేరే వారికి ఇస్తే ఊరుకుంటారా అన్నది ప్రధానమైన ప్రశ్నగా ఉంది.

గతంలో బీజేపీలో ఉన్న సిద్ధూ గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కెప్టెన్‌తో కలిసి ఆయన ఎన్నికల పోరాటం చేశారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి రేసులో సిద్ధూ కూడా నిలిచారు. అయితే తన వయసు అయిపోతోంది కాబట్టి ఇదే చివరి సారన్న ఒప్పందంతో అమరీందర్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత సిద్ధూ ప్రాధాన్యాన్ని తగ్గించారు. దాంతో మంత్రి పదవిని కూడా వదులుకుని ఆయన టీవీ షోలకు పరిమితయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోసారి కాంగ్రెస్‌లో యాక్టివ్ అయి తను అనుకున్నది సాధిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close