హార్వార్డ్ అంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. అక్కడ చదవడం ఓ గౌరవం. హార్వార్డ్ లో చదువుకున్న వ్యక్తికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది.. అలాంటి యూనివర్శిటీ అమెరికాకు గర్వకారణం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీన్ని ఓ భారంగా చూస్తున్నారు.దానిపై యుద్ధం ప్రకటించారు. వారు న్యాయపోరాటం చేస్తూంటే.. ఆ యుద్ధంలో తానే గెలుస్తానని ప్రకటిస్తున్నారు. హార్వార్డ్ పై ట్రంప్ కు ఎందుకంత పగ ?
ట్రంప్ అధికారం చేపట్టగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతిని రద్దు చేసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ విదేశీ విద్యార్థుల రికార్డులను ఇవ్వడం లేదని కారణం చెప్పారు. తర్వాత ఫెడరల్ ఫండింగ్‌ను కోత విధించారు. 2.3 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను సస్పెండ్ చేశారు. హార్వర్డ్ ఉగ్రవాద భావజాలం ఉన్న ప్రొఫెసర్లను నియమిస్తోందని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తోంది.
ట్రంప్ విధానాలపై హార్వార్డ్ విమర్శలు గుప్పిస్తోంది. ట్రంప్ విధానాలు , విదేశీ విద్యార్థులు , వలసలపై ఆయన వైఖరిని తీవ్రంగా విమర్శించింది. ఈ విమర్శలు ట్రంప్ ఆగ్రహానికి కారణమయ్యాయి. గాజా విషయంలో ట్రంప్ వైఖరిని హార్వార్డ్ లో జరిగిన ఒక గ్రాడ్యుయేషన్ సమావేశంలో పలువురు వ్యతిరేకించారు. ఇది ట్రంప్ ను హర్ట్ చేసింది. అది ఎలాంటి విశ్వవిద్యాలయం అయినా సరే తాను అధ్యక్షుడినని ..దాని సంగతి చూస్తానని బయలుదేరారు. యుద్ధంలో గెలుస్తానని ప్రకటించుకుంటున్నారు. మూర్ఖత్వంతో ఉన్న అధ్యక్షుడిది పై చేయి అవుతుందా.. ఇంటలెక్చువల్స్ బుద్ది చెబుతారా అన్నది త్వరలోనే తేలనుంది.