కేసీఆర్ పిలుపు… విరాళాల వెల్లువ..!

ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడంతో పాటు పెద్ద ఎత్తన ధ్వంసం అయిన రోడ్లు, విద్యుత్ వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంది . హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉండటంతో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. పది కోట్ల సాయం ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం రూ. పదిహేను కోట్లను సాయంగా ప్రకటించింది. తెలంగాణకు వరదలు రావడం బాధాకరమని.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి. కేసీఆర్ ఆయా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

అదే సమయంలో సీఎం కేసీఆర్ పిలుపునకు సినీ పరిశ్రమ ఒక్క ఉదుటున కదిలింది. కేసీఆర్ పిలుపునివ్వక ముందే నందమూరి బాలకృష్ణ రూ. కోటిన్నర సాయం ప్రకటించారు. కేసీఆర్ పిలుపు తర్వాత మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. కోటి ప్రకటించారు. నాగార్జున, జూ.ఎన్టీఆర్ రూ.50 లక్షలు, హీరో విజయ్‌దేవరకొండ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. విజయ్ దేవరకొండ.. తాను సీఎంఆర్ఎఫ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన రిసీప్ట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సహాయక చర్యల కోసం రూ.550 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వానికి.. అక్కినేని నాగార్జున అభినందనలు తెలిపారు. హారికా హాసిని క్రియేషన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.10 లక్షలు, డైరెక్టర్లు అనిల్ రావిపూడి, హరీష్‌శంకర్ రూ.5 లక్షలు చొప్పున ప్రకటించారు. మరికొంత మంది కూడా ప్రకటించే అవకాశం ఉంది.

మరో వైపు భారీ వ‌ర్షాలతో న‌ష్టపోయిన ప్రజ‌ల‌ను ఆదుకునేందుకు జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెల‌ల జీతాన్ని సీఎం స‌హాయ‌నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఎడతెగని వర్షం పడుతోంది. రోజూ ఏదో ఓ చోట భారీ వర్షం పడుతోంది. వందల కాలనీలు ఇప్పటికీ నీటి ముంపులోనే ఉన్నాయి. సాధారణం ఎంత పెద్ద వర్షం వచ్చిన వరద ఒక్క రోజులో తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

జనసేనను ప్లాన్డ్‌గా తొక్కేస్తున్న బీజేపీ..!?

భారతీయ జనతా పార్టీ వ్యూహం .. జనసేనను ప్లాన్డ్‌గా..తొక్కేయడమేనని పెద్దగా ఆలోచించకుండా జనసైనికులకు ఆర్థం అవుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లను బీజేపీ తెచ్చుకుంది. ఆరు శాతం ఓట్లను వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close