శ్రీనువైట్ల డబుల్ లాస్

ఆగ‌డు, బ్రూస్లీ ఫ్లాపుల త‌ర‌వాత శ్రీ‌నువైట్ల కెరీర్ గ్రాఫ్ అమాంతంగా ప‌డిపోయింది. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి హీరోలెవ‌రూ సిద్ధం కాలేదు. ఆయ‌న ఎంత తిరిగినా చెప్పులు అరిగిపోయాయే త‌ప్ప.. హీరోలు క‌నిక‌రించ‌లేదు. చివ‌రికి వరుణ్ తేజ్ తో మిస్టర్ ను తెరకెక్కించాడు. వరుసగా రెండు ఫ్లాపులతో ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డాడు వైట్ల. ఆయినకు ఖచ్చితంగా ఓ హిట్ కావాలి. అది మిస్టర్ తో వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా వైట్ల ఆశలను నిండా ముంచేసింది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చినా మిస్టర్ ఫ్లాఫ్ టాక్ ను మూటకట్టుకుంది. రెండో రోజే రిజల్ట్ చెప్పడం సరికాదు గానీ వాస్తవం మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అని తేల్చేశారు సినిమా చూసిన జనాలు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా మిస్టర్ వైట్లను మరోసారి నిరాశ పరిచిందని చెప్పకతప్పడం లేదు.

కాగ, ఈ సినిమా రిజల్ట్ వైట్లపై రెండు రకాలుగా ప్రభావం చూపించింది. ఈ సినిమాకి డబ్బులు పెట్టాడట వైట్ల. ఆగ‌డు, బ్రూస్లీ ఫ్లాపుల తర్వాత వైట్లతో సినిమా చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో వైట్లనే ఒక నిర్మాతగా మారో టాగూర్ మధుతో కలసి మిస్టర్ సెట్ చేశాడు. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా ఫ్లాఫ్ అయితే వైట్లకు ఒక్కపైసా కూడా రేమ్యునిరేషన్ కానీ, పెట్టిన డబ్బుకాని తిరిగిఇవ్వడం జరగదని అగ్రీమెంట్ చేసుకున్నారట. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాపుల లిస్టు లో చేరిపోవడం ఖాయమైయింది. ఈ రకంగా వైట్లకు డబల్ లాస్ అన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close