నయన్ ను బీట్ చేసిన కీర్తి

నయన తార టైమ్ ఓ రేంజ్ లో వుంది. సౌత్‌ సినీ పరిశ్రమలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరు.? అంటే అన్సర్ ఇవ్వడానికి రెండు మూడు పేర్లు కనిపిస్తాయేమో గానీ టాప్ రేమ్యునిరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు అంటే నయన్ పేరే వినిపిస్తుంది. మిడిల్ ఏజ్డ్ కి వచ్చినా ఆమె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ హీరోలకి , కుర్ర హీరోలకి నయన తారే కావాలి. అందుకే ఆమె పారితోషికం ఓ రేంజు లో పెంచింది.

అయితే ఇప్పుడా రేంజ్ బీట్ చేయడానికి మరో హీరోయిన్ వచ్చేసింది. ఆమె ఎవరి కాదు కీర్తి సురేష్. సినిమా ఫలితాలతో సంబధం లేకుండా క్రేజీ క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి.. ఇప్పుడు రేమ్యునిరేష్ లో కూడా అదరగొడుతుంది. దాదాపు నయనతార రేంజ్ రేమ్యునిరేషన్ ను డిమాండ్ చెస్తుందట కీర్తి. నయనతార రేంజ్ నాలుగు కోట్లని టాక్.

ఇప్పుడు కీర్తి కూడా ఇదే రేంజ్ పారితోషికాన్ని నిర్మాతల ముందు వుంచుతుందని ఇన్నర్ సర్కిల్ టాక్. అన్నీ సినిమాలకు అని కాదు. అంత క్రేజ్ లేని హీరోతో చేసే సినిమాలకు, అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఈ రేంజ్ ని డిమాండ్ చేస్తుందని వినిపిస్తుంది. కీర్తి.. తమిళ్ త పాటు తెలుగు మలయాళం చిత్ర పరిశ్రమలో కూడా మార్కెట్ సాధించుకుంది. ఇప్పుడా మార్కెట్స్ ను ద్రుష్టిలో పెట్టుకొనే ఈ రేంజ్ పారితోషికంతో షాక్ ఇస్తుందట అమ్మడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.