కన్నా కోడలు మృతి కేసులో కొత్త అనుమానాలు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మిత్రుడు ఇంట్లో జరిగిన ఓ పార్టీలో విపరీతంగా డాన్స్ చేయడం వల్ల ఒక్క సారిగా కింద పడి.. గుండెపోటుతో చనిపోయిందని మీడియాకు సమాచారం ఇచ్చారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్‌గా ఉన్న కన్నా కుమారుడు ఫణీంద్ర .. హఠాత్తుగా… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి.. ఆమె మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు ఇచ్చారు. అనేక అనుమానాలను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోలేదని.. చంపేసి ఉంటారని ప్రధానంగా కన్నా ఫణీంద్ర అనుమానం.

తన అత్తామామలు కేసును తప్పుదోవ పట్టించి, నిజాలు దాస్తున్నారని పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని ఫణీంద్ చెబుతున్నారు. మొదట సీబీఐటీ దగ్గర చనిపోయిందని చెప్పారని.. తర్వాత ఇంట్లో చనిపోయిందని చెప్పారన్నారు. చనిపోయిన రెండు గంటల తర్వాత ఆస్పత్రికి తీసుకు వచ్చారని ఏఐసీ ఆస్పత్రి వర్గాలు సర్టిఫికెట్ ఇచ్చాయని.. ఆమె చనిపోయిన ప్రాంతానికి..ఏఐజీ ఆస్పత్రికి ప్రయాణం పది నిమిషాలు కూడా ఉండదని ఫణీంద్ర చెబుతున్నారు. చనిపోయినప్పుడు మద్యం మత్తులో ఉందని ప్రచారం చేశారు. కానీ, సుహారికకు మద్యం తాగే అలవాటు లేదని ఫణీంద్ర చెబుతున్నారు.

కన్నా ఫణీంద్రది ప్రేమ వివాహం. నెల్లూరు జిల్లాకు చెందిన సుహారికను కన్నా ఫణీంద్ర ప్రేమించి… కులాంతర వివాహం చేసుకున్నారు. దీనికి కన్నా లక్ష్మినారాయణ కూడా అంగీకరించలేదని చెబుతారు. అయితే.. ఫణీంద్ర.. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని తన జీవితం తాను గడుపుతున్నారు. హఠాత్తుగా.. ఆమె మిత్రుల ఇంటికి వెళ్లి కన్నుమూయడం … కలకలం రేపింది. ఇప్పుడా మృతి మిస్టరీ తేలాలని.. కన్నా కుమారుడు కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close