తెలంగాణలో ఇక టీఆర్ఎస్ అంబులెన్స్‌ల సేవలు..!

ప్రభుత్వం 108 అంబులెన్స్‌లను నిర్వహిస్తూ ఉంటుంది. ఎవరికి ఎలాంటి అత్యవసర వైద్య సాయం అవసరం వచ్చినా ఆ అంబులెన్స్‌లు రావాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. అంబులెన్స్‌లు రావడం లేదు. ఇటీవల ఏపీ సర్కార్ మరో 400 వరకూ కొత్త వాహనాలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. పాత వాటికి రంగులేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం.. ఏమీ కొనలేదు. ప్రభుత్వం వద్ద నిధులు లేవో ఏమో కానీ.. టీఆర్ఎస్ నేతలు.. తామే సొంతంగా… ఓ వంద వరకూ కొత్త అంబులెన్స్‌లను ప్రభుత్వానికి.. ప్రభుత్వ ఆస్పత్రులకు డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉద్యమానికి కేటీఆర్ పుట్టిన రోజే వేదిక అయింది.

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వైద్య మంత్రి ఈటల రాజేందర్ .. ప్రగతిభవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. ఆ సమయంలో వైద్య సేవల ప్రస్తావన వచ్చింది. అంబులెన్స్‌ల కొరత దృష్ట్యా.. తాను పార్టీ తరపున ఆరు అంబులెన్స్‌లు డొనేట్ చేస్తానని కేటీఆర్ ఈటలకు చెప్పారు. కరోనా పరీక్షలు చేయగలిగే సామర్థ్యం ఉన్న అంబులెన్స్‌లు అయితే ప్రస్తుతం బాగా ఉపయోగడతాయని ఈటల చెప్పడంతో.. వెంటనే కేటీఆర్ ఓకే చేశారు. కేటీఆర్ ఆలోచన తెలిసిన ఇతర నేతలు కూడా.. తాము కూడా సై అయ్యారు. టీఆర్ఎస్‌లో పదవులు ఉన్నవారు.. డబ్బున్న నేతలుగా పేరు పడిన.., గంగుల కమలాకర్, మల్లారెడ్డి, నామా నాగేశ్వరరావు సహా… పలువురు నేతలు.. తాము కూడా అంబులెన్స్‌లు డొనేట్ చేస్తామని ముందుకొచ్చారు. అలా .. మొత్తంగా.. ఓ వంద అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అవి టీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేసినా.. ప్రభుత్వానికే ఇస్తారు. ప్రతి ఆస్పత్రికి ఓ అంబులెన్స్ ఉండేలా చూడాలని కేటీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ తల్చుకుంటే.. టీఆర్ఎస్ లో స్థోమత ఉన్న నేతలంతా.. అంబులెన్స్‌లను డొనేట్ చేయడానికి.. క్యూ కడతారనడంలో సందేహం లేదు. త్వరలోనే… ప్రభుత్వ అంబులెన్స్‌ల కన్నా..టీఆర్ఎస్ అంబులెన్స్‌లే ఎక్కువగా ప్రజలకు సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి మెయింటనెన్స్‌ మాత్రం… ప్రభుత్వం తరపున చేపట్టే అవకాశం ఉంది. ఏలా అయినా… ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి మెరుగైన వైద్య సదుపాయం కల్పించినా… ఆహ్వానించి తీరాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close