వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఎన్నో అనుమానాలు..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి… మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విగతజీవిగా పడి ఉండగా.. మొదట చూసిన ఆయన పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో.. ఆయన బాత్‌లో పడి ఉన్నారని.. చెప్పారు. కానీ.. బెడ్‌రూంలో.. మాత్రం.. రక్తపు మడుగు ఉందన్నారు. ఒక వేళ.. బాత్‌రూంలో పడి ఉంటే… రక్తం బెడ్‌రూంలోకి వచ్చే అవకాశం లేదు. రక్తం ధారగా కారిపోయి.. బెడ్‌రూంలోకి రావడానికి అవకాశం లేదు. ఏ ఇంటికైనా… పల్లం .. బాత్‌రూంవైపే ఉంటుంది. ఎగువ వైపు.. రక్తం … ధారగా వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే వివేకానందరెడ్డి.. తలకి, చేతికి గట్టి దెబ్బలు తగిలాయి.

గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతే… తగిలే దెబ్బలు వేరుగా ఉంటాయని.. ఎవరో కొట్టినట్లుగా అ దెబ్బలు ఉండవంటున్నారు. కింద పడితే.. ఒక వైపు మాత్రమే దెబ్బలు తగులుతాయి. కానీ.. తాను వచ్చి చూసే సరికి.. ఆయన తల వెనుక ముందు కూడా గాయాలున్నాయని.. పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకా మృతిపై ఆయన పీఏ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు విచారణ ప్రారంభించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. మరో వైపు ఆయన పోస్ట్‌మార్టం తర్వాత అసలు ఎలా చనిపోయారన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వైఎస్ కుటుంబీకులు అందరూ మెల్లగా… పులివెందుల చేరుకుంటున్నారు. ఆ ఇంట్లో.. ఆయన ఒక్కరే ఉంటున్నారు. భార్య, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరందరూ హుటాహటిన పులివెందుల చేరుకుంటున్నారు. వారు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం భిన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ వర్చువల్ మహానాడు..!

సాంకేతికత ఉపయోగించుకోవడంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంటారు. కరోనా కాలంలోనూ ఆయన ఈ సాంకేతిక ఆధారంగానే పనులు చక్క బెడుతున్నారు. జూమ్ యాప్‌ను గరిష్టంగా ఉపయోగించుకుంటున్నారు. మహానాడును కూడా డిజిటల్ మయం...

ఏడాది యాత్ర 8: సంపద సృష్టించలేక ఆస్తులు అమ్మి పాలన..!

"భూములమ్ముతున్నారు... ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా..?" అని హైకోర్టు మొహం మీదనే ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ డౌట్ హైకోర్టుకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకూ వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఉన్న...

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

HOT NEWS

[X] Close
[X] Close