వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న చనిపోయాడు. అనారోగ్యంతో చనిపోయాడని చాలా మంది అనుకున్నారు. కానీ జగన్ రెడ్డికి చెందిన సాక్షిలో.. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో అందరికీ వైఎస్ వివేకా చనిపోయినప్పుడు గుండెపోటు అని ప్రచారం చేసిన విషయమే గుర్తుకు వచ్చింది. ఏదో జరిగిందని అందరికీ అనుమానం వచ్చింది. లేకపోతే సాక్షి ఇలా తప్పుడు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. సాక్షుల్ని నిర్మూలించే మిషన్ లో భాగంగా ఒక్కొక్కరిని పైకి పంపుతున్న క్రమంలో ఇది కూడా జరిగిందా అన్న డౌట్ చాలా మందికి వస్తోంది.
ఏమీ లేకపోతే సాక్షికి .. రంగన్న మృతిపై తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏమిటి ?. పోలీసులపై నిందలేసేందుకు ఎందుకు ప్రయత్నించారు?. అసలు పోలీసులు ఎందుకు కొడతారు?. ఆయన ఇవ్వాల్సిన స్టేట్ మెంట్ సీబీఐకి ఇచ్చేశాడు. రంగన్న కీలక సాక్షి కాబట్టి.. ఆయనకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉంది. కానీ ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైద్యం ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది. దొంగలు కంగారులోనే తప్పులు చేసి దొరికిపోతూంటారు. సాక్షిని చూస్తే ఇప్పుడు ఎవరికైనా ఇదే అర్థం అవుతుంది.
పోలీసులు సాక్షిపై కూడా కేసు పెట్టారు. గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత ఘోరంగా తప్పుడు ప్రచారాలు చేశారు. పోలీసులు,సీబీఐపై నిందలేశారు. సీబీఐ పైనే కేసులు పెట్టారు. ఇలాంటివి రానున్న రోజుల్లో ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ఇటు సాక్షి యాజమాన్యానికి .. అటు వివేకా హత్యకేసు నిందితులకు క్లారిటీ వస్తుంది. దానికి ఎంతో సమయం లేదన్న వాదన వినిపిస్తోంది.