మెట్రో సిటీల్లో ఇళ్లు కొనేవారి సంఖ్య 13శాతం తగ్గింది. రెసిడెన్షియల్ సేల్స్ 2025 మొదటి ఆరు నెలల్లో గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. అన్ని చోట్లా ఈ తగ్గుదలకు కారణాలు ఒకేలా ఉన్నాయి. అధిక ధరలు, వాటిని పెంచుకుంటూ పోవడం,అంతర్జాతీయ పరిస్థితులు, సందేహాల కారణంగా డిమాండ్ తగ్గిపోతోంది. ఇళ్లు కొనాలనుకునేవాళ్లు వాయిదాలు వేసుకుంటున్నారు.
అధిక ధరల కారణంగానే ఇళ్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయడానికి బలమైన కారణమంటున్నారు కూడా ఉంది. సేల్స్ వాల్యూమ్ తగ్గినప్పటికీ సేల్స్ వాల్యూ మాత్రం స్వల్పంగా పెరిగింది. అంటే తక్కువ ఇళ్లే అమ్ముతున్నా అత్యధిక రేట్లకు అమ్ముతున్నారు. అందుకే.. అమ్ముడు కాని ఇళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రధాన నగరాల్లో ఇప్పటికి తమ్ముడు కాని ఇళ్లు 5.62 లక్ష యూనిట్లకు చేరినట్లుగా రియల్ ఎస్టేట్ ట్రెండ్ సూచిస్తోంది. ఇది సప్లై-డిమాండ్ గ్యాప్‌ను సూచిస్తోంది.
ఇళ్లు పేరుకుపోతూండటం వల్ల డెవలపర్లు డిస్కౌంట్లు ఆఫర్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ఇక ముందు పరిస్థితులు మెరుగుపడతాయని చెబుతున్నారు. 2025 చివరి నాటికి RBI రేట్ కట్స్ , PMAY విస్తరణ తో మార్కెట్ రికవర్ అవుతుందని అంచనా, కానీ ప్రస్తుతం మాత్రం కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారని మార్గెట్ వర్గాలు అంచనాకు వచ్చాయి.