‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో ‘నారప్ప‌’ విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్ బాబు. అయితే మ‌రో అనూహ్య‌మైన మ‌రో సంగ‌తేంటంటే.. ఇటీవ‌లే ప‌ట్టాలెక్కిన ‘దృశ్య‌మ్ 2’ని ‘నారప్ప‌’ కంటే ముందే విడుద‌ల చేయ‌బోతున్నార్ట‌. మ‌ల‌యాళంలో విడుద‌లైన దృశ్య‌మ్ ని తెలుగులో వెంక‌టేష్ రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు `దృశ్య‌మ్ 2` కూడా రావ‌డం, ఆ సినిమాకీ వెంకీ రీమేక్ చేస్తుండ‌డం తెలిసిన విష‌యాలే. `నారప్ప‌` షూటింగ్ అయ్యాకే.. వెంక‌టేష్ `దృశ్య‌మ్ 2` మొద‌లెట్టాడు. నార‌ప్ప త‌ర‌వాతే… దృశ్య‌మ్ రావాల్సివుంది. కానీ… ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. నార‌ప్ప‌ని హోల్డ్ లో పెట్టి, దృశ్య‌మ్ 2 ని విడుద‌ల చేయాల‌ని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈనెలాఖ్‌రులోగా.. `దృశ్య‌మ్ 2` షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. మేలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి, జూన్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఆ త‌ర‌వాతే.. `నార‌ప్ప‌` రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close