గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న పై ప‌వ‌న్ ఫ్యాన్స్ కారాలు మిరియాలూ నూరేస్తున్నారు. గోగినేని ఓ మూర్ఘుడ‌ని, ఉన్మాది అని ఓ రేంజులో వేసుకుంటున్నారు.

ప‌వ‌న్ కోవిడ్ బారీన ప‌డ‌డం.. అందుకు సంబంధించిన ఓ ప్రెస్ నోట్, ఓ ఫొటో.. ప‌వ‌న్ టీమ్ విడుద‌ల చేయ‌డం తెలిసిన విష‌యాలే. ఆసుప‌త్రి ప‌డ‌క మీద‌.. ప‌వ‌న్ ప‌డుకుని ఉన్న ఫొటో.. ప‌వ‌న్ ఫ్యాన్స్ బాగా వైర‌ల్ చేశారు. ఓ అభిమాని… ఆ ఫొటో ఆధారంగా ఓ బొమ్మ గీశాడు. ప‌వన్ ప‌డుకుంటే, వివేకానందుడు, చెగోవేరా.. ప‌వ‌న్‌ని ప‌రామ‌ర్శిస్తున్న‌ట్టు ఉన్న ఫొటో అది. అభిమానులు క‌దా, వాళ్ల ఊహ‌ల‌కు హ‌ద్దులేం ఉంటాయి..? ప‌వ‌న్‌ని ఆ రేంజులోనే ఆరాధిస్తారు కాబ‌ట్టి, ఆ బొమ్మ‌లో అభిమానుల‌కు త‌ప్పు క‌నిపించ‌లేదు. స‌రిక‌దా, దాన్నీ వైర‌ల్ చేసేశారు.

దాన్ని గోగినేని ప‌ట్టుకున్నాడు. “39 ఏళ్ల‌కే చ‌నిపోయిన వివేకానందుడు, అదే వ‌య‌సులో చంప‌బ‌డ్డ డాక్ట‌ర్ చే.. ఇద్ద‌రూ రిస్క్ తీసుకుని మాస్క్ పెట్టుకోకుండా వ‌స్తే, అభిమానుల కోసం చ‌క్క‌గా త‌ల దువ్వుకుని న‌ల‌గ‌ని లుంగీలో డ్రెస్ అయ్యి, సెలైన్ ఎక్కించుకుంటున్న 49 ఏండ్ల యువ హీరోని ప‌రామ‌ర్శించ‌డం చాలా స్ఫూర్తి దాయ‌కం..“ అంటూ సెటైర్లు వేశాడు. “మీక‌న్నా త‌క్కువ పుస్త‌కాలు చ‌దువుకున్న వివేకానందుడి స్థానాన్ని మీరు భ‌ర్తీ చేయాలి“ అంటూ.. ఇంకోటి త‌గిలించాడు. నెల్స‌న్ మండేలా, గాంధీజీ, ఏసు ప్ర‌భు రాలేదా? అంటూ కౌంట‌ర్లు వేశాడు.

ఇన్ని ర‌కాలుగా ఓ ఫొటోని చిత్ర‌హింస‌లు పెట్టేలా కామెంట్లు చేస్తే – ప‌వ‌న్ ఫ్యాన్స్ కి కోపం రాకుండా ఎలా ఉంటుంది? అందుకే వాళ్లూ గోగినేనిని ఓ రేంజులో వేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ.. గోగినేని ప‌వ‌న్ ఫ్యాన్స్ కంట్లో ప‌డ‌లేదు. ప‌డితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసొస్తుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు కుప్పం వస్తే బాంబులేస్తాం.. వైసీపీ నేతల హెచ్చరిక !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబును రెండు రోజులు తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో అన్నితిట్లు తిడుతున్నారు. పట్టాభి సీఎంను అసభ్యంగా ఓ పదంతో తిట్టారని.. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ...

“మా” ఎన్నికలకు వైసీపీ పరిశీలకుడిగా రౌడీషీటర్ వచ్చారట !

"మా" ఎన్నికలను పర్యవేక్షించి మంచు విష్ణును గెలిపించేందుకు వైసీపీ తరపున ఎన్నికల పరిశీలకుడిగా ఓ నొటొరియస్ క్రిమినల్‌ను పంపినట్లుగా ప్రకాష్ రాజ్ కొత్తగా ఆరోపణలు చేశాయి. ఎన్నికలు జరుగుతున్నసమయంలో.. కౌంటింగ్‌లో ఫోన్‌లో...

విమర్శలు ప్రజాస్వామ్యసహితంగా ఉండాలి : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బూతులు, నీచమైన భాషతో ట్వీట్లు పెట్టే వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విజయసాయిరెడ్డి కూడా .. రాజకీయ విమర్శలు ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నారు. విశాఖలో వైసీపీ నేతలు ఏర్పాటు...

‘గామి’ కి బన్నీ మాట సాయం

గామి.. ఇప్పటి సినిమా కాదు. నాలుగేళ్ల క్రితం గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకుడు కాగిత విద్యాధర్‌. తను నమ్ముకున్న కాన్సెప్ట్ ఎలాగైనా ప్రేక్షకులకు చూపించాలని...

HOT NEWS

[X] Close
[X] Close