డీఎస్‌కు ఇది బంపర్ ఆఫర్!

కాంగ్రెస్ లో ఉన్నారో లేదో ఎవరూ పట్టించుకోని డి. శ్రీనివాస్ కు బంపర్ ఆఫర్ తగిలింది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష పుణ్యమా అని తెరాసలో ఓ మాంచి పదవే దక్కబోతోంది. అది హోం మంత్రి పదవి కావచ్చని కొన్ని టీవీ చానల్స్ లో స్క్రోలింగ్స్ సందడి చేశాయి. అది కాకపోతే మరో పదవి. మొత్తానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్ కు ఇది జాక్ పాట్ వంటిదే.

రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్, వైఎస్ రాజశేఖరరెడ్డి జోరుమీదున్న కాలంలో ఆ పదవిలోకి వచ్చారు. ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ క్రెడిట్ లో కొంత డీఎస్ ఎకౌంట్లోకి వచ్చింది. 2009లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ గట్టెక్కినప్పుడూ ఆయనే పీసీసీ అధ్యక్షుడు. కాంగ్రెస్ లో చాలా కాలం మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఎం ఎల్ సి పదవినిచ్చారు. పార్టీ కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనయుడిని నిజామాబాద్ మేయర్ ను చేసిందీ కాంగ్రెస్ పార్టీయే.

ఇప్పుడు తనను పక్కనబెట్టారనే ఆవేదనే ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసింది. మొన్నటి ఎం ఎల్ సి ఎన్నికల్లో తనను కాదని ఓ మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం ఆయనకు ఆగ్రహం కలిగించినట్టుంది. ఇలాగైతే ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో, కేసీఆర్ ఆఫర్ వచ్చింది. నో అనడానికి కారణాలేమీ కనిపించలేదు. ఎలాగూ కాంగ్రెస్ అధికారంలో లేదు. అధికారంలో ఉన్నప్పుడు తనకు గుర్తింపునిచ్చిన పార్టీని వదిలి వెళ్లాలా అనే మొహమాటం ఈ కాలపు నాయకులకు ఉండదని అందరికీ తెలిసిందే.

నిజామాబాద్ అర్బన్ లో పట్టుందనే కారణంతోనే ఆయన్ని కేసీఆర్ ఆహ్వానించి ఉంటారని భావిస్తున్నారు. పార్టీలోకి వచ్చీ రాగానే ఆయనకు మంచి పదవి దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే బడా, చోటా నాయకులకు కొదువలేదు. జిల్లా అధికార పార్టీలో పదవుల కోసం ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారు అలాగే ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారనే అభిప్రాయం గులాబీ శిబిరంలో చాలా మందికి ఉంది. కానీ కేసీఆర్ కు ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు.

డీఎస్ తో పాటు ఇంకా చాలా మంది కారెక్కుతారని అంటున్నారు. వారిలో జనబలం ఉన్న వారు ఎంత మందో తెలియాల్సి ఉంది. అసలు డీఎస్ కు ఉన్న ప్రజాబలమే అంతంత మాత్రం అని ప్రత్యర్థుల విమర్శ. నిజామాబాద్ అర్బన్ లోనూ తిరుగులేని నాయకుడేమీ కాదని వారు ఎద్దేవా చేస్తుంటారు. మరి ఏ ప్రయోజనం ఆశించి ఆయనకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారని గులాబీ కేడర్ చర్చల్లో మునిగింది. ఈ మధ్య ఇతర పార్టీల నుంచి పిలిచి పెద్దపీట వేసిన వారిలో చాలా మంది కనీసం కౌన్సిలర్ గా గెలవలేరని విపక్షాల నుంచే కాదు, గులాబీ శిబిరం నుంచి కూడా కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి డి. శ్రీనివాస్ రాజకీయ కెరీర్ లో రెండో ఇన్సింగ్స్ ఘనంగా మొదలు కాబోతుంది. లక్కీ డీఎస్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close