రేవంత్‌పై కొత్తగా మూడుకేసులు నమోదు, బెయిల్‌పై సుప్రీంలో అప్పీల్

హైదరాబాద్: నిన్న చర్లపల్లి జైలునుంచి విడుదలైన తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మల్కాజ్‌గిరి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు అయ్యాయి. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించటం, అనుమతిలేకుండా ఊరేగింపు నిర్వహించటం అనే అభియోగాలపై వివిధ సెక్షన్లకింద పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, గోపీనాథ్, గాంధిలమీదకూడా ఈ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు రేవంత్‌కు హైకోర్ట్ బెయిల్ ఇవ్వటంపై తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రేవంత్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com