ముస్లిమ్‌లకు వరాలు ప్రకటించిన కేసీఆర్: ఆ ‘రెండు’ అంశాలపై మౌనం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలారోజుల తర్వాత ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను, ముస్లిమ్‌లకు ఇస్తున్న వరాలను ప్రకటించిన సీఎమ్, రాజకీయ అంశాలపై నోరు మెదపకపోవటం విశేషం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్ ఇటీవల  ఇచ్చిన విందుకు గైర్హాజరు కావటం, నిన్న రేవంత్ రెడ్డి చేసిన తీవ్రవిమర్శలు వంటి రాజకీయ అంశాలపై స్పందించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని ప్రస్తావించలేదు.

ఈనెల 8న నిజాంకాలేజిలో ప్రభుత్వంతరపున భారీ ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ రంజాన్‌కు మొత్తం మీద ప్రభుత్వం రు.26కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రతి మసీదువద్ద 1,000మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాలలోకూడా ఇఫ్తార్ నిర్వహిస్తామని వెల్లడించారు. ముస్లిమ్‌లకు ఇంకా అనేక వరాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇవన్నీ రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో వారిని ఆకట్టుకోవటానికేనని విశ్లేషకులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close