ఒకప్పుడు భారత అత్యంత ధనవంతులకు మాత్రమే పరిమితమైన దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్, ఇప్పుడు మన దేశంలోనిమధ్యతరగతి కుటుంబాలకు కూడా చేరువవుతోంది. 2024లో భారతీయులు దుబాయ్‌లో రూ. 84,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. 2025లో ఆగస్టు వరకు 18,678 లావాదేవీలు జరిగాయి.AED 51.1 బిలియన్లు అంటే సుమారు రూ.1.15 లక్షల కోట్లు విలువైనవి. ఇది మునుపటి సంవత్సరం కంటే చాలా ఎక్కువ పెరిగింది.
ఈ ఆకస్మిక మార్పుకు కారణాలుగా ఎక్కువ రెంటల్ ఆదాయం, ట్యాక్స్-ఫ్రీ ఆదాయం, గోల్డెన్ వీసా ప్రయోజనాలుగా భావిస్తున్నారు. అదే సమయంలో మధ్యతరగతి బడ్జెట్‌కు సరిపడే ఆస్తుల లభ్యత పెరగడం కూడా కీలక కారణం. దుబాయ్ లో ఆస్తులు కొంటున్న విదేశీ కొనుగోలుదారులలో భారతీయులు 22 శాతం ఉన్నారు. దుబాయ్ జనాభా 2011లో 20 లక్షల నుంచి 2025లో 40 లక్షలకు రెట్టింపు అయింది, 2030 నాటికి 50 లక్షలకు చేరుతుందని అంచనా.
దుబాయ్ ఆస్తులు ముంబై లేదా ఢిల్లీ వంటి మెట్రోల కంటే 30-40 శాతం చౌకగా ఉన్నాయి. ఉదాహరణకు, బుర్జ్ ఖలీఫా లేదా పామ్ జుమైరాలో లగ్జరీ అపార్ట్మెంట్ A సుమారు రూ. 5.5 కోట్లు. అదే ముంబైలో 30-40 శాతం ఎక్కువ. మధ్య తరగతి వర్గాలకు రూ 2 కోట్లకూ అపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. 20 శాతం డౌన్ పేమెంట్ తో రుణం లభిస్తుంది. దుబాయ్‌లో నాన్-రెసిడెంట్ లోన్లు 50-60 శాతం వరకూ అందుబాటులో ఉన్నాయి. వడ్డీ రేట్లు చాలా తక్కువ. 3.5-4.3 శాతం మధ్య ఉంటాయి. ఇండియాలో 9 శాతం పైనే ఉన్నాయి.
రూ. 4.4 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టితే 10 సంవత్సరాల గోల్డెన్ వీసా లభిస్తుంది, ఇది కుటుంబానికి రెసిడెన్సీ, బిజినెస్ అవకాశాలు అందిస్తుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు “పాస్‌పోర్ట్-అడ్జాసెంట్” పర్క్గా మారింది . అయితే దుబాయ్ బూమ్ ఆకర్షణీయమైనా, 2008 క్రైసిస్లా 50% ప్రైస్ డ్రాప్ రిస్క్ ఉందని కొంత మంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

