రోజులు మారిపోయాయని అంటే.. ఎంతగా మారిపోయాయో.. దువ్వాడ, దివ్వెల జంట తీరును చూసి తెలుసుకోవచ్చు. వారు చేస్తున్నదే నైతికంగా తప్పుడుపని. అలాంటి వారు తిరుమలలోనూ తప్పులు చేస్తున్నారు . కేసుల పాలవుతున్నారు. దేవుడి సన్నిధిలో తప్పులు చేసి .. కేసులు పెట్టించుకుంటున్నందుకు సిగ్గుపడి ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటామని దేవుడి ఎదుట లెంపలు వేసుకోవాల్సింది పోయి…టీటీడీ చైర్మన్‌పై ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
తిరుమలలో రీల్స్ చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటున్నారు. కొండపై శ్రీవారి నామం తప్ప మరింకేమీ వేడుకలు జరగకూడదని వారికి తెలుసు. అయినా కేసు తీసుకు వచ్చి పుట్టినరోజువేడుకలు చేసుకుని అది ఎగ్ లెస్ కేక్ అని వితండవాదం చేస్తున్నారు. ఈ ఇష్యూ బయటకు వచ్చేసరికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ జగమెరిగిన జంట.. టీటీడీ చైర్మన్ పై ఆరోపణలు చేస్తున్నారు.
టీటీడీ చైర్మన్ పేరుతో బయటకు వచ్చిన వీడియోలు ఫేక్ అని తేలాయి. వాటిని తీసేయాలని కోర్టు ఆదేశించింది. ప్రచారం చేయవద్దని కూడా ఆదేశించింది. అయినా టీటీడీ చైర్మన్ రాసలీలలు చేశారు కాబట్టి తాము కేకు కట్ చేయడం తప్పు కాదని మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు టీటీడీ చైర్మన్ ఎందుకొచ్చారు?. దేవుడిపై భక్తి, భయం లేనప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. వినాశకాలే విపరీతబుద్ధి అని ఊరికనే అనరు.
